18న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటన.. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏమంటున్నాయంటే..
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది మరెప్పుడో కాదు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 18న రానుంది. ఈ వార్తలు ఎవరో చెప్పడం లేదు. స్వయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్సే ప్రచారం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది మరెప్పుడో కాదు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 18న రానుంది. ఈ వార్తలు ఎవరో చెప్పడం లేదు. స్వయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్సే ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడ చూసినా ఇదే రచ్చ. ఈ నెల 18న ఎన్టీఆర్ నుంచి సంచలన ప్రకటన ఉంటుందనీ.. అది పొలిటికల్ ఎంట్రీకి సంబంధించినదేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల హీరోలు పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిలో ఒకరు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండగా.. మరొకరు ఏకంగా తమిళనాడు సీఎంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో, తారక్ ఎంట్రీ కూడా వచ్చే (2029) ఎలక్షన్లో ఉంటుందని... ఈ క్రమంలోనే మీడియా వర్గాలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోషియన్స్ క్లారిటీ ఇస్తూ కీలక ప్రకటన చేశాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం తన సినిమా ప్రాజెక్టులపైనే ఉందని ఫ్యాన్స్ అసోసియేషన్స్ చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆయన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను రూమర్స్‌గానే పరిగణించాలని తెలిపాయి. ఈ వార్త అయితే తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాకపోవడం గమనార్హం.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ప్రకటనలో క్లారిటీ ఇస్తూ.. జూలై 18న ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన ఉంటుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తమ దృష్టికి వచ్చిందని.. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపడేశారు. ఈ విషయంపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదన్నారు. జూలై 18న నిర్వహించనున్న ఊరువాడా కార్యక్రమాన్ని చాలా ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించామని.. దాని ఉద్దేశం ఊరువాడ ప్రధాన ఆలోచన, లక్ష్యాన్ని ప్రజలకు పరిచయం చేయడం మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమానికీ.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ప్రచారానికీ ఎలాంటి సంబంధమూ లేదన్నారు.