కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయం.. అసలేమైందంటే..
మాజీ సీఎం కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయమైంది. వెంటనే హిమాన్షును గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG)కి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ హిమాన్షు ముక్కుకు గాయమైనట్టుగా తెలుస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయమైంది. వెంటనే హిమాన్షును గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG)కి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ హిమాన్షు ముక్కుకు గాయమైనట్టుగా తెలుస్తోంది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్టు సమాచారం. మనవడికి గాయమైందనే విషయం తెలియగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి బయల్దేరి వెళ్లారు.
హిమాన్షును పలకరించిన మీదట మనవడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఏఐజీకి వెళ్లిన కేసీఆర్ సైతం ఇక్కడే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కుమారుడి ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్ ఈ నెల 6న సాయంత్రం స్పోర్ట్స్ ఇంజురీతో హిమాన్షు గాయపడినట్టు తెలిపారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. స్వల్ప గాయమేనని, త్వరలోనే హిమాన్షు పూర్తిగా కోలుకుంటాడని.. తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.