Entertainment

127 కట్స్.. 3 పేర్లు.. అయినా విడుదలకు నోచుకోలే.. అసలంత ఘోరం ఏముందా సినిమాలో?

ఒక సినిమా విడుదలకు పురుటి నొప్పులు పడాల్సి వచ్చింది. టైటిల్ చేంజ్ చేసినా ఏం చేసినా కూడా వెండితెరపై విడుదలకు నోచుకోలేదు. చివరకు వెండితెర సాధ్యం కానున్నా.. ఓటీటీకైనా వెళదామని భావించి అక్కడైతే విడుదలైంది కానీ..

127 కట్స్.. 3 పేర్లు.. అయినా విడుదలకు నోచుకోలే.. అసలంత ఘోరం ఏముందా సినిమాలో?

ఒక సినిమా విడుదలకు పురుటి నొప్పులు పడాల్సి వచ్చింది. టైటిల్ చేంజ్ చేసినా ఏం చేసినా కూడా వెండితెరపై విడుదలకు నోచుకోలేదు. చివరకు వెండితెర సాధ్యం కానున్నా.. ఓటీటీకైనా వెళదామని భావించి అక్కడైతే విడుదలైంది కానీ.. రెండే రెండు రోజుల్లో అక్కడి నుంచి కూడా ఔట్ అయిపోయింది. అసలు ఏంటా సినిమాఝ అందులో అంత ఘోరమైన కంటెంట్ ఏముంది? తెలుసుకుందాం.

పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమే ‘సత్లుజ్’. ఈ సినిమాకు వెండితెరపై విడుదలయ్యేందుకు ఎన్నో అడ్డంకులు రావడంతో చివరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో విడుదలైంది. కానీ ఆ సంస్థ ఆదివారం చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. దీనిని భారతీయ కేటలాగ్ నుంచి తొలగించామని, జీ5 గ్లోబల్‌‌లో మాత్రం ఇది అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అసలెందుకు ఆ సినిమాను తొలించాల్సి వచ్చింది? జీ5 ఏం చెప్పిందంటే.. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చే వరకూ ‘సత్లుజ్’ భారతదేశంలో అందుబాటులో ఉండదని తెలిపింది. సరైన ప్రక్రియ ద్వారానే ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తగిన మార్గాలను అన్వేషిస్తామని వెల్లడించింది. దీంతో పెద్ద ఎత్తున సినిమాపై చర్చలు ప్రారంభమయ్యాయి.

ఖల్రా జీవిత కథేంటంటే..

1980, 1990లలో పంజాబ్‌‌లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమం చెలరేగింది. ఈ ఉద్యమ సమయంలో వేలాది మంది మరణించారని.. జరిగిన తిరుగుబాటు ఉద్యమం సమయంలో వేలాది మంది మరణించారు. ఆ గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అక్రమంగా దహనం చేశారని అపన్పట్లో మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా ప్రపంచానికి తెలియజేశారు. తిరుగుబాటు సమయంలో అదృశ్యమైన వేలాది మంది మృతదేహాలను వారి కుటుంబాలకు కనీసం సమాచారం ఇవ్వకుండా పోలీసులు రహస్యంగా దహనం చేశారట. దీనికి సంబంధించిన ఆధారాలను ఖల్రా డాక్యుమెంట్ చేయడంతో అప్పట్లో అది అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత 1995లో ఖల్రాను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఖల్రా కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేయడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు పోలీసు అధికారులకు జీవితఖైదు శిక్ష పడింది. ఇక ఇటీవలి కాలంలో ఖల్రా జీవితం ఆధారంగానే సత్లుజ్ సినిమా రూపొందింది. బాలీవుడ్ డైరెక్టర్ హనీ టెహ్రాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఖల్రా పాత్రలో దిల్‌‌జీత్ దొసాంజ్ నటించారు.

ఏకంగా 127 కట్స్..

రాజకీయంగా ఇది అత్యంత సున్నితమైన కావడంతో ఈ సినిమాకు సుదీర్ఘ సర్టిఫికేషన్ అడ్డంకులొచ్చాయి. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌‌సీ) క్లియరెన్స్ ఇచ్చేందుకు ఎన్నో మార్పులను సూచించింది. తొలుత 21 కట్స్‌ను సూచించిన సీబీఎఫ్‌సీ ఆ తర్వాత ఏకంగా 127 కట్స్ చూపించింది. భారీ మార్పులు, కట్స్‌ సూచించడంతో ఈ సినిమా సాధారణ ఎడిట్‌‌ల కంటే ఈ డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని మేకర్స్ ఆరోపించారు. అంతేకాకుండా సినిమా నుంచి జస్వంత్ సింగ్ ఖల్రా పేరును సైతం తొలగించాలని బోర్డు తమను కోరినట్లు డైరెక్టర్ హనీ టెహ్రాన్ ఆరోపించారు. సీబీఎఫ్‌‌సీ సూచించిన కట్‌‌లను మేకర్స్ అంగీకరించలేదు. దీంతో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకుండా ఉండిపోయింది. చివరికి ఈ సినిమా అన్‌‌కట్‌‌గా ఓటీటీలో శుక్రవారం విడుదలైంది. ఓటీటీలో ఇలా అడుగు పెట్టిందో లేదో.. కేవలం రెండంటే రెండు రోజుల్లోనే భారతదేశంలో దీనిని తొలగించారు. అసలెందుకు జీ5 భారతదేశంలో ఈ చిత్రాన్ని నిలిపివేసింది? గతంలో జరిగిన సర్టిఫికేషన్ సమస్యలకు.. నిలిపివేతకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియరాలేదు.

ముందుగానే చెప్పిన దిల్‌జీత్..

సినిమా సర్టిఫికేషన్ వివాదం తలెత్తడంతో ఈ సినిమా పేరును మేకర్స్ మూడు సార్లు మార్చారు. మొదట సిక్కుల మారణ హోమాలతో ముడిపడి ఉన్న పదమైన ‘ఘల్లుఘరా’ అని.. ఆ తర్వాత ‘పంజాబ్ 95’, చివరకు ‘సత్లుజ్’గా టైటిల్ మార్చుకుంది. ‘సత్లుజ్’ పేరుతోనే ఓటీటీలో విడుదలైంది. అయినా సరే.. ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించే అవకాశం ఉందని దిల్‌‌జీత్ దొసాంజ్ ముందుగానే చెప్పేశారు. ఇన్‌‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌‌లో దిల్‌‌జీత్ దొసాంజ్ మాట్లాడుతూ.. ఇవాళ శనివారమని.. సోమవారం నాటికి దీనిని తీసేయవచ్చని తాను భావిస్తున్నానని.. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సత్లుజ్ సినిమాను సమగ్ర పరిశీలన, భద్రతాపరమైన తదుపరి చర్యల కోసం ఇంటర్‌‌‌‌డిపార్ట్‌‌మెంటల్ కమిటీ(IDC)కి పంపాలని కేంద్రం యోచిస్తోందని మంగళవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భద్రతా ఆందోళనల కారణంగానే ఓటీటీ నుంచి ఈ సినిమాను తొలగించాలని జీ5ను ఆదేశించామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 8, 2026 3:47 AM