RamCharan: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రామ్ చరణ్ ‘పెద్ది’
రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వచ్చిన ‘పెద్ది’ వెండితెరపై ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్ వెర్షన్ కంటే..
రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వచ్చిన ‘పెద్ది’ వెండితెరపై ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్ వెర్షన్ కంటే ఓటీటీలో కొన్ని సీన్స్‌ను యాడ్ చేసినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. వెండితెరపై రన్‌టైం కారణంగా కట్ చేసిన సన్నివేశాలను, థియేటర్‌లో విడుదలైయ్యాక తొలగించిన సీన్స్‌ను సైతం ఓటీటీలో యాడ్ చేసినట్లు తెలుస్తోంది (Peddi OTT). మరి ఓటీటీలో రన్ టైం ఎంత ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అభిమానులు అయితే ఖుష్ అవుతున్నారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘పెద్ది’ అందుబాటులోకి వచ్చింది.
‘పెద్ది’ కథేంటంటే.. విజయనగరం జిల్లాలోని కొండ కింద ఊరులో పద్దెనిమిది వందల మంది జీవనం సాగిస్తున్నా.. ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరికి గుర్తింపు లేదు. అందుకే ఆ ఊరు అన్నా, అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు. రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోరు. ఆ ఊళ్లో పుట్టి పెరిగిన వాడే పెద్ది (రామ్‌చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలి పనులు చేస్తూనే క్రికెట్ ఆడుతూ ఉంటాడు. క్రికెట్‌లో పెద్ది రాటుదేలిన ఆటగాడు కావడంతో విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీపడుతుంటాయి. అలాంటి పెద్ది క్రికెట్‌ని వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ కథలో అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ఎవరు?వంటి అంశాలన్నింటినీ సినిమాచూసి తెలుసుకుకోవాల్సిందే.