తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ బీ కేర్‌ఫుల్.. గీత దాటారో కోతే..!
బుల్లితెరపై బీభత్సమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్ '. ఇప్పటికే తెలుగులో ఈ షో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ పదవ సీజన్‌కు సైతం కింగ్ అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
బుల్లితెరపై బీభత్సమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్ '. ఇప్పటికే తెలుగులో ఈ షో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ పదవ సీజన్‌కు సైతం కింగ్ అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్ 10 ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో గ్రాండ్‌గా ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే షో ప్రారంభానికి ముందే ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ న్యూస్‌తో బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కంటెస్టెంట్స్ షాక్ అవుతున్నారు. ఈసారి తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో లేని విధంగా కఠినమైన నిబంధనలు అమలు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పదో సీజన్ విషయానికి వస్తే.. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. కొందరు మాత్రం ఎప్పుడూ చెప్పేదేగా అని కొట్టిపడేస్తున్నారు. ఇక ఈ షో ఈసారి కంటెస్టెంట్ల పాలిట 'అగ్నిపరీక్ష' కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. హౌస్‌కి వెళ్లిన కంటెస్టెంట్స్ ఇష్టానుసారంగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. అలా అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగతంగా దూషించడం, మతం, కులం, భాష , ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందట. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఏకంగా రూ.10 లక్షల జరిమానా ఉంటుందని టాక్. అంత జరిమానా విధిస్తే కంటెస్టెంట్స్‌కి వచ్చేదేముంటుంది? ఇదంతా కేవలం రూమర్స్ అని కొందరంటున్నారు.