Entertainment

త్వరలోనే పట్టాలెక్కనున్న 'డ్యూ డేట్‌'..

పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను తొలిసారిగా మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'డ్యూ డేట్‌'. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది.

త్వరలోనే పట్టాలెక్కనున్న 'డ్యూ డేట్‌'..

పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను తొలిసారిగా మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'డ్యూ డేట్‌'. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వర్షిష్‌ స్టూడియోస్‌ పతాకంపై ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా లోమేష్‌ పూడిపెద్ది, జయశ్రీ‌, నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రణీత పట్నాయక్‌, విజ్క్షానిలపై నేడు ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌ ఇవ్వగా, సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీవాస్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు.

ఇటీవల సక్సెస్‌ రేస్‌లో ముందున్న నిర్మాతలు ఎస్‌కేఎన్‌, ధీరజ్‌ మొగిలినేని, వంశీ నందిపాటి చిత్ర దర్శకుడు ఆనంద్‌కు స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ వేడుకకు, దర్శకుడు విజయ్‌ కనకమేడల, విఐ ఆనంద్‌ తదితరులు హాజరయ్యారు. ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగిస్తుందన్నారు. మొత్తానికి ‘డ్యూ డేట్’ చిత్రీకరణకు సర్వం సిద్ధమైంది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 8, 2026 1:17 PM