రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. వరుడెవరంటే..
తెలుగు ప్రేక్షకులకు కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన స్వాతి.. 2023లో ఆమె నటించిన 'మంత్ ఆఫ్ మధు' మూవీ దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకుంది.
తెలుగు ప్రేక్షకులకు కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన స్వాతి.. 2023లో ఆమె నటించిన 'మంత్ ఆఫ్ మధు' మూవీ దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకుంది. ఇక నేడు ( జూలై 8, 2026 ) 'Hitched' అనే సింగిల్ వర్డ్‌తో పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. సంప్రదాయబద్దంగా తెల్లటి వస్త్రధారణలో వరుడు శ్రీకాంత్ కనిపించగా.. స్వాతి వచ్చేసి కేరళ శైలిలో ఆకుపచ్చ రంగు అంచున్న తెల్లటి చీర ధరించింది. హోమం ముందు కూర్చుని ఇద్దరూ ఒకటవుతున్న దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాంత్ నాగోటితో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు స్వయంగా కలర్స్ స్వాతి ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును కలర్స్ స్వాతి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అతనితో విడిపోయింది. అయితే విడాకుల వార్తలపై ఆమె స్పందించింది అయితే లేదు. కొంత గ్యాప్ తర్వాత 2023లో 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సమయంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి అది పెళ్లి వరకూ వెళ్లిందని టాక్. మొత్తానికి కలర్స్ స్వాతికి సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వాతి.. కలర్స్ అనే షోకు యాంకరింగ్ చేసి కలర్స్ స్వాతిగా మారింది. ఆ తరువాత వెండితెరపై 'అష్టాచమ్మా', 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి చిత్రాల్లో నటించి మంచి సక్సెస్ అందుకుంది.