Entertainment Breaking News

విడుదలకు సిద్ధమవుతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి సమర్పణలో, శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది.

విడుదలకు సిద్ధమవుతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి సమర్పణలో, శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వి. సాంబశివరావు, సి. వేణుగోపాల చారి వ్యవహరిస్తుండగా, TFDA అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రముఖ దర్శకుల చేతుల మీదుగా విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచార చిత్రాలు ట్రెండింగ్‌లో నిలవడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు (డల్లాస్) మాట్లాడుతూ, “ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేశాం. ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ గ్రామీణ నేపథ్యంలో ప్రారంభమయ్యే ప్రేమకథ. అనంతరం ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా మలుపులు తిరుగుతూ, గోవా నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని తెలిపారు. అలాగే, తండ్రి పాత్రలో సుమన్ తన అనుభవంతో కథకు మరింత బలం చేకూర్చారని, ఆనంద్ భారతి ప్రేక్షకులు ఊహించని ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని చెప్పారు. తల్లి పాత్ర కూడా భావోద్వేగాలను పండించేలా ఉంటుందని వెల్లడించారు.

ఈ చిత్రంలో హీరోగా మనోజ్, హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రల్లో అప్పారావు, చిత్రం శ్రీను నటించగా, ప్రతినాయకుడి పాత్రలో సర్కార్ కనిపించనున్నారు. చిత్రంలోని ఆరు పాటలు, మూడు యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న రమేష్ బాబు చెరుకూరు (డల్లాస్) తెలుగు సినిమాపై ఉన్న అభిరుచితో ఎన్నో ఏళ్లుగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. తన బిజీ జీవితాన్ని పక్కనపెట్టి స్వదేశానికి వచ్చి, ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడిగా ఇది తన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని విలువైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఉన్నట్లు పేర్కొన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 9, 2026 3:43 AM