Entertainment

మరోసారి హాట్ టాపిక్‌గా తరుణ్, ఈషా.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్!

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త జంటలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నాగ చైతన్య - శోభిత, ఆ తరువాత సమంత - రాజ్ నిడుమోరు, విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న, కలర్స్ స్వాతి - శ్రీకాంత్ నాగోతి అంతా ప్రేమించుకుని.. వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

మరోసారి హాట్ టాపిక్‌గా తరుణ్, ఈషా.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్!

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త జంటలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నాగ చైతన్య - శోభిత, ఆ తరువాత సమంత - రాజ్ నిడుమోరు, విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న, కలర్స్ స్వాతి - శ్రీకాంత్ నాగోతి అంతా ప్రేమించుకుని.. వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న జంట.. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ జంట. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ చాలా కాలంగా వార్తలు అయితే వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూర్చేలా మరో ఘటన కూడా జరిగింది. అదేంటో తెలుసుకుందాం.

గత కొంతకాలంగా హీరోయిన్ ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ డేటింగ్‌లో ఉన్నారంటూ టాలీవుడ్ కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి’ అనే మూవీలో జంటగా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందని టాక్. ఆ సినిమా తర్వాతి నుంచి వీరిద్దరికీ సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కూడా తెగ వైరల్ అవుతోంది. వీటికి బలాన్ని చేకూర్చేలా గత దీపావళి వేడుకల్లో హీరో విశ్వక్‌సేన్ ఇంట్లో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించారు. ఆ తరువాత ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఈవెంట్‌లోనూ తరుణ్ భాస్కర్ తన ప్రేమకథపై హింట్ ఇచ్చారు. అది చాలదన్నట్టుగా విజయ్ దేవరకొండ-రష్మిక వివాహానికి సైతం వీరిద్దరూ జంటగా కలిసి వెళ్లారు. ఇవన్నీ చూస్తుంటే కేవలం గాసిప్సే కావని.. నెక్ట్స్ ఇండస్ట్రీలో పెళ్లికి రెడీ అవుతున్న జంట.. తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బయేనని టాక్ నడుస్తోంది.

తాజాగా మరోసారి తరుణ్ భాస్కర్, ఈషారెబ్బలు.. శంషాబాద్ విమానాశ్రయంలో పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాలు సైతం ఏవీ లేవు. అలాంటప్పుడు వీరిద్దరూ కలిసి ఎక్కడకు వెళుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి త్వరలోనే వీరిద్దరి పెళ్లి వార్త వినిపిస్తుందని సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తరుణ్ భాస్కర్‌కు గతంలోనే లతా నాయుడుతో వివాహమైంది. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు లత ప్రొడక్షన్, కాస్ట్యూమ్ విభాగాల్లో పని చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బ కెరీర్ అయితే కష్టాల్లోనే ఉంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆమె చేతిలో లేదు. పైగా ఎందుకో కానీ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతున్నా గుర్తింపే లేదు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 9, 2026 9:54 AM