రైల్లో హనీమూన్ సెటప్ చేసుకున్న జంట.. నెట్టింట వైరల్.. టీటీఈపై వేటు
అది పబ్లిక్ ప్రయాణించే రైలు అనుకున్నారో.. మరేమనుకున్నారో కానీ ఓ జంట హనుమూన్‌ను రైల్లోనే సెటప్ చేసుకుంది. విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన రైల్వే శాఖ సదరు రైలు టీటీఈపై సస్పెన్షన్ వేటు వేసింది.
అది పబ్లిక్ ప్రయాణించే రైలు అనుకున్నారో.. మరేమనుకున్నారో కానీ ఓ జంట హనుమూన్‌ను రైల్లోనే సెటప్ చేసుకుంది. విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన రైల్వే శాఖ సదరు రైలు టీటీఈపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంతకీ ఆ జంట ఎవరు? ఆ రైలు కథేంటి? తెలుసుకుందాం. అది బల్లార్షా టు ముంబై 11002 నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్‌లో ఓ జంట ప్రయాణించింది. అంతేకాకుండావీరు ఆన్‌లైన్‌లో ఒక డెకరేటర్‌ను సైతం బుక్ చేసుకున్నారు. ఆ డెకరేటర్ వారికి హనుమూన్ సెటప్‌ను డెకరేట్ చేసి ఇచ్చారు. ఈ సెటప్ అంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహారాష్టలోని జల్నాకు చెందిన ఓ జంట తమ కోసం ఓ రైలు క్యాబిన్‌ను బుక్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ జంట జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయానికే వారు బుక్ చేసుకున్న 'రహత్ రూమ్ డెకరేషన్' నిర్వాహకులు రైలు కంపార్ట్‌మెంట్‌ను హనీమూన్ సెటప్‌లా అందంగా అలంకరించారు. ఇక ఆ జంట జల్నా స్టేషన్‌లో రైలు ఎక్కానే.. తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలని హనీమూన్ సెటప్‌ను వీడియో తీసింది. బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో చాలా అందంగా కనిపించింది. ఇలా డెకరేషన్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే ఆ దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అవి కాస్తా రైల్వే అధికారుల దృష్టికి సైతం వెళ్లాయి. వెంటనే అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
రైలు బోగిని హనీమూన్ సూట్‌లా డెకరేట్ చేయడానికి ముందు.. అసలు రైల్లోకి డెకరేషన్ చేసేవారిని అనధికారికంగా రావడాన్ని రైల్వే శాఖ తీవ్రమైన వైఫల్యంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆ రైలులో టీటీఈగా విధులు నిర్వర్తించిన గిరీష్ కుమార్‌ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు అధికారులు ఆదేశించారు. బయటి వ్యక్తుల్ని అనుమతి లేకుండా రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం వంటివన్నీ నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. అసలు అటువంటి వాటన్నింటినీ టీటీఈ ఎలా అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొత్త జంట రైలు ప్రయాణాన్ని ఓ గుర్తుగా మార్చుకోవాలన్న ప్రయత్నం రైల్వేపై విమర్శలకు కారణమైంది. ప్రస్తుతం ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.