లేటైనా.. లేటెస్ట్‌గా మెహిదీపట్నం శ్రీ చైతన్య సంబరాలు..
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో ఆలస్యంగానైనా లేటెస్ట్‌గా సంబరాలు నిర్వహించారు. శనివారం ఈ పాఠశాలలో ఫాదర్స్ డేని(పితృ దినోత్సవం) అత్యంత ఘనంగా నిర్వహించారు.
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో ఆలస్యంగానైనా లేటెస్ట్‌గా సంబరాలు నిర్వహించారు. శనివారం ఈ పాఠశాలలో ఫాదర్స్ డేని(పితృ దినోత్సవం) అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రి ప్రైమరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకి శ్రీ చైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్ ఎన్. స్వాతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వాతి మాట్లాడుతూ.. ‘నాన్న అంటే బాధ్యత అని.. నవ మాసాలు మోసి కన్న అమ్మ రుణం తీర్చుకోలేనిదన్నారు.
అదేవిధంగా మనం జీవితంలో ఎదిగేవరకూ తోడుండే నాన్న కూడా అంతే గొప్పవారన్నారు. అందుకోసమే ఆయనకంటూ ఓ రోజుని అంకితం చేస్తూ ఫాదర్స్ డేని జరుపుకుంటున్నామని స్వాతి తెలిపారు. తల్లిదండ్రులను పిల్లలు ఎల్లప్పుడూ గౌరవించడంతో పాటు వారి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలన్నారు. ఈ ఫాదర్స్ డే కార్యక్రమంలో కోఆర్డినేటర్ పుష్పాంజలి, ప్రీ ప్రైమరీ విభాగం ఇన్‌చార్జ్ పుష్ప, పీఈటీ అనిత, టీచర్లు సంగీత, శ్రీవిద్య, పీఈటీ అనిత, విద్యార్థులు, వారి తండ్రులు పాల్గొన్నారు.