others

Rain Alert: తెలంగాణకు గుడ్ న్యూస్.. ఏఏ జిల్లాలకు భారీ వర్షాలంటే..

వానల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

Rain Alert: తెలంగాణకు గుడ్ న్యూస్.. ఏఏ జిల్లాలకు భారీ వర్షాలంటే..

వానల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్‌బాద్, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచింది ఉంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు.. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 4, 2026 2:57 AM