others

Gas Price: హమ్మయ్య.. ఊపిరి పీల్చుకోండి.. గ్యాస్ ధరలు తగ్గుతున్నాయ్..

హమ్మయ్య గ్యాస్ ధరలు తగ్గుతున్నాయ్. అయితే అది సాధారణ ప్రజానీకానికి కాదులెండి. హోటళ్లు, రెస్టారెంట్స్, చిరు వ్యాపారులకు. వాస్తవానికి గ్యాస్ ధరలు పెరగడంతో ముఖ్యంగా చిరు వ్యాపారులు, హోటళ్ల వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.

Gas Price: హమ్మయ్య.. ఊపిరి పీల్చుకోండి.. గ్యాస్ ధరలు తగ్గుతున్నాయ్..

హమ్మయ్య గ్యాస్ ధరలు తగ్గుతున్నాయ్. అయితే అది సాధారణ ప్రజానీకానికి కాదులెండి. హోటళ్లు, రెస్టారెంట్స్, చిరు వ్యాపారులకు. వాస్తవానికి గ్యాస్ ధరలు పెరగడంతో ముఖ్యంగా చిరు వ్యాపారులు, హోటళ్ల వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ ధర పెంచితే కస్టమర్లు రావడం కష్టం. అలాగని గ్యాస్ ధరలను భరించడం కష్టం. ఈ క్రమంలోనే కేంద్రం వారికి భారీ ఊరట కల్పించింది.  ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ల ధరలను తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.183.50 మేర తగ్గించగా.. అవి నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అవును 2026, జూలై 1 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి.

పశ్చిమాసియా ఇంధన సంక్షోభంతో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం జరిగింది. దీంతో హెర్మూజ్ గుండా ముడి చమురు, గ్యాస్‌ రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇటీవలే యుద్ధం ఆగిపోవడం.. హెర్మూజ్ జలసంధి తెరుచుకోవడం వంటి పరిణామాలతో గ్యాస్, ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు భారీ ఉపశమనం కలగనుంది.

ఈ తగ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,113.50 నుంచి రూ. 2,930కి చేరింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుని వాటి ధరలను తగ్గించిన ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఇళ్లలో ఉపయోగించే14.2 కేజీల వంట గ్యాస్ ధరలు యథాతథంగా ఉండటంతో గృహ వినియోగదారులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. వాటి ధరలపై కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
July 1, 2026 4:25 AM