iPhone 18: ఐఫోన్ 18 గురించి బిగ్ అప్‌డేట్స్..
ఐఫోన్ 18 సిరీస్‌పై అనేక లీక్స్, రూమర్లు సోషల్ మీడియాలో, టెక్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న ఐఫోన్ 18 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
ఐఫోన్ 18 గురించి ఇప్పటివరకూ కొన్ని రూమర్లు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆపిల్ తన డబ్ల్యుడబ్ల్యుడీసీ కార్యక్రమంలో రాబోయే ఐఫోన్‌ల గురించి అధికారికంగా వివరాలైతే వెల్లడించలేదు. అయినప్పటికీ ఐఫోన్ 18 సిరీస్‌పై అనేక లీక్స్, రూమర్లు సోషల్ మీడియాలో, టెక్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న ఐఫోన్ 18 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
ఐఫోన్ 18లో ఉండే అవకాశమున్న ఫీచర్స్..
డైనమిక్ ఐలాండ్‌లో ప్రస్తుతం ఉన్నదానికంటే ఐఫోన్ 18 చిన్నదిగా ఉండే అవకాశం ఉంది.
కెమెరాలో వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీ రావచ్చని ప్రచారం.
గత మోడళ్ల కంటే పెద్ద బ్యాటరీ ఇవ్వొచ్చు
అయితే మెమరీ చిప్‌ల కొరత కారణంగా కొన్ని భాగాల స్పెసిఫికేషన్లు తగ్గించే అవకాశం ఉందని కూడా రూమర్లు చెబుతున్నాయి.
కొత్త రంగుల్లో ఐఫోన్ 18..
ఈసారి ఆపిల్ మూడు కొత్త కలర్ ఆప్షన్లు తీసుకురావచ్చని సమాచారం. అవి..
లైట్ బ్లూ
డార్క్ చెర్రీ
డార్క్ గ్రే
ధరలు పెరిగే అవకాశమా?
ఇటీవల ఆపిల్ తన మాక్, ఐపాడ్, హోమ్‌పాడ్, ఆపిల్ టీవీ వంటి ఉత్పత్తుల ధరలను పెంచింది. అదే విధంగా ఐఫోన్ 18 ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విడుదల తేదీపై ఆసక్తికర రూమర్
ఈసారి అన్ని ఐఫోన్‌లను ఒకేసారి విడుదల చేయకుండా రెండు దశల్లో లాంచ్ చేసే అవకాశముందని సమాచారం.
సెప్టెంబర్ 2026: ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, అలాగే ఫోల్డబుల్ ఐఫోన్
వసంతకాలం 2027: ఐఫోన్ 18, ఐఫోన్ 18E, రెండో తరం ఐఫోన్ ఎయిర్
ఇది నిజమైతే ఆపిల్ అనుసరిస్తున్న సంప్రదాయ విడుదల విధానంలో పెను మార్పు అవుతుంది.
ఫోల్డబుల్ ఐఫోన్ కూడా?
ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న ఫోల్డబుల్ ఐఫోన్ ఈసారి నిజం కావచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని కొందరు ఐఫోన్ ఫోల్డ్, మరికొందరు ఐఫోన్ అల్ట్రా అని పిలుస్తున్నారు. దీని ప్రారంభ ధర 2,000 డాలర్లకు పైగా ఉండొచ్చని అంచనా.
ఎన్ని మోడళ్లు రావచ్చు?
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొత్తం ఆరు మోడళ్లు ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 18
ఐఫోన్ 18 ప్రో
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 18E
రెండో తరం ఐఫోన్ ఎయిర్
ఫోల్డబుల్ ఐఫోన్
డిజైన్‌లో మార్పులు
స్క్రీన్ సైజులు దాదాపు యథాతథంగానే ఉండొచ్చు.
ప్రో మోడళ్లలో 6.3 అంగుళాల డిస్‌ప్లే
ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే
బేస్ మోడల్‌లో కెమెరా బంప్ కొద్దిగా చిన్నదిగా ఉండొచ్చు. అయితే Pro మోడళ్లలో మూడు కెమెరాల కోసం పెద్ద కెమెరా ప్లాట్‌ఫామ్ కొనసాగనుంది. కొన్ని లీక్స్ ప్రకారం ప్రో మోడల్ వెనుక భాగంలో సబ్‌టిల్ ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు. అలాగే ప్రస్తుత రెండు రంగుల డిజైన్ స్థానంలో మరింత యూనిఫామ్ లుక్ వచ్చే అవకాశం ఉంది.
డైనమిక్ ఐలాండ్‌లో పెను మార్పు
డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గించేందుకు ఆపిల్ ప్రయత్నిస్తోందని అనేక రూమర్లు చెబుతున్నాయి.
ఫ్రీ ఐడీ సెన్సర్లు డిస్‌ప్లే కింద ఉండే అవకాశం.
ముందు కెమెరా చిన్న పిన్‌హోల్ రూపంలో కనిపించవచ్చు.
మరో లీక్ ప్రకారం డైనమిక్ ఐలాండ్ పూర్తిగా తొలగిపోదు. కానీ ప్రస్తుతం ఉన్నదానికంటే సుమారు 35 శాతం సన్నగా మారుతుందని సమాచారం.
కొన్ని నివేదికల ప్రకారం పాక్షిక అండర్ డిస్‌ప్లే ఫేస్ ఐడీ మాత్రమే ఉండవచ్చు. అందువల్ల డైనమిక్ ఐలాండ్ పూర్తిగా మాయమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.