SBI: ఎస్‌బీఐలో ఉద్యోగం.. భారీ వేతనం.. హైదరాబాద్‌లో పోస్టింగ్.. మిస్సయ్యారో..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో భారీ వేతనంతో ఉద్యోగం.. హైదరాబాద్‌లో పోస్టింగ్ అంటే మామూలు విషయమా? అస్సలు మిస్ అవకండి. అసలు ఆ ఉద్యోగం ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో భారీ వేతనంతో ఉద్యోగం.. హైదరాబాద్‌లో పోస్టింగ్ అంటే మామూలు విషయమా? అస్సలు మిస్ అవకండి. అసలు ఆ ఉద్యోగం ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలన్నీ మీకోసం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కేటగిరీలో బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ–-II) ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జూన్ 24 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి 2026, జులై 14 వరకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35. కాగా వాటిలో హైదరాబాద్‌కు 2 ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేసి.. మూడేళ్ల కనీస అనుభవం కలిగి ఉండాలి. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు.
అప్లికేషన్ ఫీజు వివరాలు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజేమీ లేదు.
లాస్ట్ డేట్: జులై 14. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆగస్టులో ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషియెన్సీ టెస్ట్) ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ. మరిన్ని వివరాలకు sbi.bank.inను సందర్శించండి.