others Breaking News

మెహిదీపట్నం శ్రీచైతన్యలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యాజమాన్యం, టీచర్లు, విద్యార్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు.

మెహిదీపట్నం శ్రీచైతన్యలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యాజమాన్యం, టీచర్లు, విద్యార్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ఆధ్వర్యంలో అత్యంత సందడిగా ఈ వేడుక జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. యోగా అనేది మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుందని అన్నారు. యోగా కేవలం వ్యక్తిగత జీవనశైలికే కాకుండా ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు కూడా ఎంతో అవసరమన్నారు. అదేవిధంగా సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుందని.. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి ఎంతో అవసరమన్నారు.

అన్ని వయసుల వారు యోగా చక్కగా చేయవచ్చని.. పని, పోషణ, నిద్రలతో కూడిన సమతుల్య జీవనశైలికి సంబంధించిన దుఃఖాన్ని నిర్మూలించడానికి ఇది తోడ్పడుతుందని స్వాతి అన్నారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, పుష్పాంజలి, ఇన్‌చార్జులు అరుణ, మల్లేశ్, యాదగిరి, పుష్ప, పీఈటీలు కృష్ణ, అనిత తదితరులు పాల్గొన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 24, 2026 4:10 AM