Entertainment

Ramcharan: రామ్ చరణ్ తన ట్విన్స్‌ని చూపించేందుకు డేట్ ఫిక్స్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, ఉపాసన దంపతుల తొలి పాప క్లీంకార గురించి అందరికీ తెలుసు. ప్రస్తుతం క్లీంకారను రామ్ చరణ్ కుమార్తెగా చెప్పనవసరం లేదు. అంతలా పాప ఫేమస్ అయిపోయింది.

Ramcharan: రామ్ చరణ్ తన ట్విన్స్‌ని చూపించేందుకు డేట్ ఫిక్స్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, ఉపాసన దంపతుల తొలి పాప క్లీంకార గురించి అందరికీ తెలుసు. ప్రస్తుతం క్లీంకారను రామ్ చరణ్ కుమార్తెగా చెప్పనవసరం లేదు. అంతలా పాప ఫేమస్ అయిపోయింది. రెండు రోజుల క్రితం క్లీంకార మూడవ పుట్టినరోజు సందర్భంగా పాప ఫేస్‌ను రామ్ చరణ్ దంపతులు రివీల్ చేశారు. పాపను చూసి ఫ్యాన్స్ అంతా ఖుషీ అయ్యారు. పాపం అచ్చుగుద్దినట్టుగా రామ్ చరణ్‌లానే ఉందంటూ నెట్టింట పెద్ద చర్చే నిర్వహించారు. ఇక ఈ ఏడాది జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఇక ఆ బాబు, పాపకు రామ్ చరణ్ దంపతులు శివరామ్, అన్వీరా దేవిగా పేరు పెట్టారు. ఈ పేర్లకు ఆధ్యాత్మిక అర్థాలున్నాయి.

శివరామ్ పేరులో శివుడు, రాముడు ఇద్దరి శక్తులు దాగి ఉన్నాయి. అంతేకాకుండా తన తండ్రి అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్’‌లోని శివను తన కుమారుడికి రామ్ చరణ్ పెట్టారు. ఇక అన్వీరాదేవికి అర్థమేంటంటే.. అన్వీరా అంటే ధైర్యం కలదని.. దేవి అమ్మవారి పేరు కలిసివచ్చేలా రెండూ కలిపి పెట్టారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తన ముద్దుల కవల పిల్లలను ఎప్పుడు చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే పిల్లల చేతులను మాత్రమే నెట్టింట షేర్ చేసిన రామ్ చరణ్ దంపతులు వారి ఫేస్‌లు ఎప్పుడు రివీల్ చేస్తారనే చర్చ నడుస్తోంది. అయితే క్లీంకార ఫేస్‌ను మూడవ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేశారు కాబట్టి ఆ లెక్కన శివరామ్, అన్వీరాదేవి ఫేస్‌లను 31, జనవరి 2029లో రివీల్ చేయవచ్చని అంతా అంటున్నారు. అంటే శివరామ్, అన్వీరా ఫేస్‌లను చూసేందుకు ఫ్యాన్స్ మరో రెండున్నరేళ్లు ఆగాల్సిందేనని తెలుస్తోంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 23, 2026 2:43 PM