Janhvi Kapoor: ప్రియుడి గురించి హింట్ ఇచ్చిందా? కన్ఫర్మ్ చేసిందా?
‘దేవర’, ‘పెద్ది’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసేసినట్టేనా? ఒక్క జాకెట్‌తో ఆమె క్లారిటీ ఇచ్చిందా?
‘దేవర’, ‘పెద్ది’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసేసినట్టేనా? ఒక్క జాకెట్‌తో ఆమె క్లారిటీ ఇచ్చిందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆమె ప్రియుడు ఎవరని టాక్ నడుస్తోందంటే.. స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేత మనవడు. ఆ నాయకుడు మరెవరో కాదు.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే. ఆయన మనవడు శిఖర్ పహారియాతో అమ్మడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే అమ్మడు లేటెస్ట్‌గా ఓ హింట్‌తో ఆ రూమర్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. ఈ ముద్దుగుమ్మ నేరుగా ఏం హింట్ ఇవ్వలేదులెండి. నైట్ వేర్‌లో ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దానిపై ఉన్న కొటేషన్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తాజాగా జాన్వీ కపూర్ ఎయిర్‌పోర్ట్‌లో పింక్ కలర్ నైట్ వేర్‌ను ధరించి కెమెరాలకు చిక్కింది. ఆమె వేసుకున్న గ్రే జాకెట్‌పై అందరి కళ్ళు పడ్డాయి.
ఆ జాకెట్‌పై ‘నేను ఒకవేళ తప్పిపోతే.. దయచేసి నన్ను శిఖర్ పహారియాకు అప్పగించండి’ ( If Lost, Please Return to Shikhar Pahariya) అని రాసి ఉంది. అది చూసేందుకు క్యాజువల్‌గా ఉన్నా కూడా.. జాన్వీ మాత్రం తన రిలేషన్‌షిప్‌ను పరోక్షంగా అఫీషియల్ చేసేసిందని బాలీవుడ్ టాక్. దానిని చూసిన నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున ఈ పిక్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే జాన్వీ తన రిలేషన్ గురించి ఇలా ఓపెన్ కావడం ఇదేం మొదటిసారి కాదని తెలుస్తోంది. గతంలో ఆమె శిఖర్ అనే పేరున్న నెక్లెస్‌ను ధరించి కెమెరాల ముందుకు రావడం.. గత ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ నటించిన 'హోమ్‌బౌండ్' చిత్ర ప్రీమియర్‌కు శిఖర్ ప్రత్యేకంగా హాజరై ఆమెకు మద్దతు తెలపడం వంటివి జరిగాయి. చివరకు తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు పలు ఫ్యామిలీ ఈవెంట్లలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇన్ని హింట్లు ఇచ్చాక ఇంకేముంటుంది? అప్పుడు తన ప్రేమను బహిర్గతం చేసిందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.