Entertainment

#Mega158: గ్లింప్స్ వదిలిన బాబీ.. జీవించేశారన్నయ్య అంటూ..

'వాల్తేరు వీరయ్య'తో థియేటర్లలో పూనకాలను లోడ్ చేసిన మెగాస్టార్- డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ తిరిగి రిపీట్ అవుతోంది. వీరిద్దరి కాంబోలో #Mega158 తెరకెక్కుతోంది. ఈ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ను మించి ఉంటుందని టాక్.

#Mega158: గ్లింప్స్ వదిలిన బాబీ.. జీవించేశారన్నయ్య అంటూ..

'వాల్తేరు వీరయ్య'తో థియేటర్లలో పూనకాలను లోడ్ చేసిన మెగాస్టార్- డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ తిరిగి రిపీట్ అవుతోంది. వీరిద్దరి కాంబోలో #Mega158 తెరకెక్కుతోంది. ఈ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ను మించి ఉంటుందని టాక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనుంది. మెగా అభిమానులైతే ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పొల్లాచ్చిలో ఒక సుదీర్ఘమైన, కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అక్కడ చిరుపై కొన్ని ఛేజింగ్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక అదిరిపోయే గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

ఈ చిత్రం నిన్నటి (సోమవారం) నుంచి హైదరాబాద్‌లో సరికొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్ అత్యంత ఎక్స్‌ప్లోజివ్‌గా ఉండనుందని ఓ హింట్ కూడా ఇచ్చేసింది. ఒక వినూత్నమైన ఊరగాయల తయారీ బ్యాక్‌డ్రాప్ ఉన్న లొకేషన్‌లో ఈ షూటింగ్ జరుగనుంది. ఇక్కడ చిరుతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న షూటింగ్‌లో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో రెండు విభిన్నమైన కోణాలున్న పాత్రలో చిరు మెప్పించనున్నారు. గ్లింప్స్ చివరలో ‘జీవించేశారు అన్నయ్య’ అంటూ చిరుని బాబీ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 22, 2026 3:34 PM