Balan - The Boy: ‘బాలన్’ సినిమా హిట్టా? ఫట్టా?
దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ‘బాలన్: ది బాయ్’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్" అనే అంశంతో ఈ చిత్రం రూపొందింది. మనిషికి జీవించాలనే సంకల్పం ఉంటే చాలు.. ఎంతటి కఠిన పరిస్థితులను ఎదుర్కొనైనా జీవించగలమనే ఆలోచన ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది.
చిత్రం: బాలన్: ది బాయ్
విడుదల: 19-06-2026
నటీనటులు: ఆదిశేషన్, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, డాలీ జూన్, జీన్ పాల్ లాల్, గిరీష్ ఏడీ, టొవినో థామస్ తదితరులు
ఎడిటర్: వివేక్ హర్షన్
మ్యూజిక్: సుషిన్ శ్యామ్
దర్శకుడు: చిదంబరం
నిర్మాత: వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్
దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ‘బాలన్: ది బాయ్’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్" అనే అంశంతో ఈ చిత్రం రూపొందింది. మనిషికి జీవించాలనే సంకల్పం ఉంటే చాలు.. ఎంతటి కఠిన పరిస్థితులను ఎదుర్కొనైనా జీవించగలమనే ఆలోచన ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. ఎంచుకున్న అంశం అయితే యూనిక్‌గానూ.. అద్భుతంగానూ ఉంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దామా?
కథేంటంటే..
కథలో బాలన్ (చిన్న వయసులో ఆదిశేషన్, పెద్దయ్యాక మహమ్మద్ జినాన్), అతని తల్లి (ఫర్జానా పలతింగల్) తమ అసలు గుర్తింపును దాచిపెట్టి జీవిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ ప్లేస్ మార్చుకుంటూ ఉంటారు. అయితే బాలన్ తల్లి గతం ఆమెను వెంటాడుతుండటంతో అతనికి దూరమవుతుంది. ఆ తరువాత ఏం జరిగంది? కానీ వారి బంధం అంతటితో తెగిపోయిందా? లేదా అనే అంశంతో కథ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నెరేషన్ అంతా చాలా స్లోగా అనిపిస్తుంది కానీ ఆసక్తికరంగా నడు్తుంది. పాత్రల మెంటల్ స్టేటస్‌పై ప్రేక్షకుడు ఫోకస్ పెట్టేలా కథను దర్శకుడు తీర్చిదిద్దాడు. ముఖ్యంగా తల్లీకొడుకుల బంధం, బాలన్‌లో క్రమంగా వస్తున్న మార్పులు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. చాలా వరకూ అంశాలను అతిగా చెప్పకుండా సున్నితంగా చూపించడం విశేషం. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. బాలన్ పెద్దవాడయ్యాక సినిమా టోన్ పూర్తిగా మారుతుంది. పోలీస్ అధికారి పవిత్రన్‌తో అతను చేసే పోరాటం, దొంగ అబ్బాస్ (టొవినో థామస్)తో గడిపే జీవితం వంటి అంశాలను ఆసక్తకరంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌లోని సెన్సిటివిటీ, ఉత్కంఠ అనేవి సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి అంతగా కనిపించవు. కథ కంటే సంఘటనలకే దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వలన సినిమాపై ఆసక్తి కొంత కొరవడతుంది.
ఎవరెలా నటించారంటే..
సినిమాలో ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్న వ్యక్తి ఫర్జానా పలతింగల్. అమ్మ పాత్రలో ఆమె జీవించారనే చెప్పాలి. చాలా సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. చిన్న బాలన్‌గా ఆదిశేషన్ చాలా బాగా నటించాడు. అబ్బాస్ పాత్రలో టోవినో థామస్ సైతం అద్భుతంగా నటించాడు. ముహమ్మద్ జినాన్, డాలీ జూన్, జీన్ పాల్ లాల్, గిరీష్ ఏడీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు ఫస్ట్ హాఫ్‌పై పెట్టినంత శ్రద్ధ.. సెకండాఫ్‌పై పెట్టలేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సంఘటనలకు ఇచ్చినంత ప్రాధాన్యత కథకు ఇవ్వలేదు. అదే చేసి ఉంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండేది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. సుశిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు హైలైట్.
ఫైనల్‌గా.. ‘బాలన్’ యూనిక్ స్టోరీ, పాత్రదారుల నటన కోసం సినిమా చూడొచ్చు.
రేటింగ్: 3/5