Entertainment

Deewana Review: ‘దీవాన’ ఎలా ఉందంటే..

హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఘలై జంటగా శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘దీవాన’. జెమిని టీవీ యాంకర్‌ని డైలీ చూస్తుండటంతో ఈ కథ తనకు తట్టిందని శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Deewana Review: ‘దీవాన’ ఎలా ఉందంటే..

టైటిల్‌: దీవాన

విడుదల: 19-06-2026

నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, నరేశ్‌, ఝాన్సీ తదితరులు

మ్యూజిక్: ఈశ్వర్‌ చంద్‌

ఎడిటర్: హృషికేశ్ పాస్పల్

నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి

దర్శకత్వం: శ్రీకాంత్‌ సంగిశెట్టి

హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఘలై జంటగా శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘దీవాన’. జెమిని టీవీ యాంకర్‌ని డైలీ చూస్తుండటంతో ఈ కథ తనకు తట్టిందని శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ చిత్రంలో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడదగిన ఎలిమెంట్స్ ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు. మరి ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందా? చూద్దాం.

కథేంటంటే..

డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డి) ఫ్రెండ్స్‌తో కలిసి తాగడం, తిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు సరికదా కనీసం తండ్రి కష్టం.. తల్లి ఆవేదన ఏదీ పట్టించుకోడు. ఈ క్రమంలోనే ఒకరోజు వినాయకచవితి సెలబ్రేషన్స్‌లోఅమూల్య (స్నేహా మణిమేఘలై)ని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. కరెంట్ బిల్ కట్టేందుకని మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ అమూల్యను చూస్తాడు. ఇక రోజుకో బిల్లు తీసుకెళ్లడం.. అమూల్యకు ప్రపోజ్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే అరెస్ట్ అవడం.. మున్నా తండ్రి (నరేష్) అతడిని విడిపించేందుకు వస్తే.. పోలీసులు ఆయనను కూడ స్టేషన్‌లో కూర్చోబెడతారు. దీంతో తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇంటి నుంచి వెళ్లిపోతాడు. అయితే తాను నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్నానని.. నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని వచ్చి కనిపించమని.. అప్పటి వరకూ తనకు కనిపించవద్దని అమూల్య చెబుతుంది. దీంతో మున్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని డిసైడ్ అవుతాడు. మున్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడా? మున్నాను అమూల్య ఎందుకు రిజెక్ట్ చేసింది? మున్నాది నిజంగానే వన్ సడ్ లవ్వా? తెలుసకోవాలంటే చిత్రం చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

దర్శకుడు శ్రీకాంత్ దీనిని ఫ్యామిలీ ఎంటర్‌టైర్ అన్నారు కానీ ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవడం కష్టమే. ఇదొక సాధారణ లవ్ స్టోరీ. జులాయిగా తిరిగే యువకుడు.. ఓ అమ్మాయిని చూసి లవ్‌లో పడటం.. ఆ అమ్మాయి పెట్టిన కండీషన్‌తో సెట్ అవడం అనేది కాన్సెప్ట్. గతంలోనూ చాలా కథలు ఇలాగే వచ్చాయి. అయితే ఈ కథకు ఓ కాన్ఫ్లిక్ట్అనేది దర్శకుడు జోడించాడు. ప్రేమకు కులమతాలు, వయసు పట్టింపులు మాత్రమే కాదు.. ఎలాంటి అంశమూ అడ్డంకి కాదని చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు. ఫస్టాఫ్ అంతా ఫ్రెండ్స్, గొడవలు, అమూల్యను చూసి లవ్‌లో పడటం వంటి అంశాలతో రూపొందింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మంచి ట్విస్ట్ వస్తుంది. అదే సినిమాకు ప్రాణం. ఇక సెకండ్ హాఫ్ విషయానికి ముననా జాబ్ కోసం పడే కష్టమంతా రియాలిటీకి చాలా దూరంగా.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడం, మంచి లవ్ స్టోరీ ఆకట్టుకునే అంశాలు. ఫ్యామిలీ సెంటిమెంట్‌లో డెప్త్ లేకపోవడం.. హాస్య సన్నివేశాలు పెద్దగా పండకపోవడం, రొటీన్ లవ్ స్టోరీ వంటివి మైనస్ అంశాలు. ఇవన్నీ దాటుకుని సినిమా నిలబడటం అనేది ఒకింత కష్టమే.

ఎవరెలా చేశారంటే..

మున్నాగా హర్షిత్ రెడ్డి తన పాత్రను చక్కగా పోషించాడు. తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా.. ఫ్రెండ్స్‌తో తిరిగే ఓ జులాయిగా బాగానే మెప్పించాడు. హీరోయిన్ మణిమేఘలై చాలా అందంగా కనిపించింది. ఆమె నటనకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర అయితే కాదనే చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. నరేష్ మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఝాన్సీ కూడా తల్లిగా మెప్పించింది. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. జీవన్‌ అయితే ఉన్నారు కానీ ఆయన కామెడీ టైమింగ్‌ను దర్శకుడు పెద్దగా వాడుకోలేక పోయాడు దర్శకుడు. వేణు, రఘు తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

‘దీవాన’ విజువల్ పరంగా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం విషయానికి వస్తే పాటలు, బీజీఎం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఎడిటింగ్.. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఫ్యామిలీ సెంటిమెంట్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది.

ఫైనల్‌గా.. ‘దీవాన’ యూత్‌కి కనెక్ట్ అవ్వొచ్చేమో..

రేటింగ్: 2.5/5

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 20, 2026 6:55 AM