Entertainment

Ram Charan: వావ్ క్లీంకార.. అచ్చుగుద్దనట్టు రామ్ చరణే..

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన పెద్ద కుమార్తె క్లీంకార కొణిదెలను చూసే అవకాశం అభిమానులకు ఇంత కాలానికి లభించింది. క్లీంకారను చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Ram Charan: వావ్ క్లీంకార.. అచ్చుగుద్దనట్టు రామ్ చరణే..

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన పెద్ద కుమార్తె క్లీంకార కొణిదెలను చూసే అవకాశం అభిమానులకు ఇంత కాలానికి లభించింది. క్లీంకారను చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో ఒకసారి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో క్లీంకారతో రామ్ చరణ్ దంపతులు వెళుతుండగా క్లీంకార ఫేస్ కనిపించీ కనిపించనట్టుగా కనిపించింది. దానిని చూసి వావ్.. క్లీంకార ఎంత అందంగా ఉందోనని మురిసిపోయారు. మొత్తానికి క్లీంకార ఫేస్‌ను రామ్ చరణ్ దంపతులు రివీల్ చేశారు. అచ్చుగుద్దినట్టుగా రామ్ చరణ్‌లా క్లీంకార కనిపిస్తోందని కొందరు అభిమానులు.. లేదు లేదు ఉపాసనలా ఉందని కొందరు నెట్టింట పెద్ద చర్చే పెట్టేశారు. రామ్ చరణ్, ఉపాసన పాపతో ఆడుకుంటూ చాలా సరదాగా ఆ ఫోటోలో కనిపించారు. ఇవాళ (శనివారం) క్లీంకార మూడో పుట్టినరోజు కావడంతో ఫేస్‌ను రివీల్ చేశారు. ఈ లెక్క ప్రకారం రామ్ చరణ్ దంపతుల కవలలు శివరామ్, అన్వీరాదేవిని చూడాలంటే మరో రెండున్నరేళ్లు ఆగాల్సిందేనేమో.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 20, 2026 3:35 PM