‘మర్మదేశం’ గుర్తుందా? దానికి కొనసాగింపే ‘వీరభద్ర’.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
తెలుగు టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అప్పట్లో ఓ టెలివిజన్ ఛానల్‌లో వచ్చిన మర్మదేశం గుర్తుందా?
తెలుగు టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అప్పట్లో ఓ టెలివిజన్ ఛానల్‌లో వచ్చిన మర్మదేశం గుర్తుందా? తొలి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తింది. ఇన్నాళ్లు అదే ‘మర్మదేశం అనే ప్రపంచం నుంచి ‘వీరభద్రుని రహస్యం’ అనే వెబ్ సిరీస్ ఇది జూన్ 26 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. 1990ల్లో టెలివిజన్‌లో ఈ కల్ట్ మిస్టరీ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తిరిగి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో ఈ మిస్టరీ సిరీస్ కొనసాగనుంది. నమ్మకం ఆజ్ఞలను విధించే శక్తిగా మారి.. భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేయనుంది. దేవుడిపై ఉన్న గాఢ విశ్వాసం నీడలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలను ఈ వెబ్‌సిరీస్‌లో చూపించనున్నారు.
కథ విషయానికి వస్తే.. తరతరాలుగా వీరభద్రపురం గ్రామ ప్రజలు తమ గ్రామ దైవం వీరభద్ర స్వామిని నమ్ముకుని జీవిస్తూ ఉంటారు. గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు.. అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాడని గ్రామస్తుల నమ్మకం. ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా.. ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తూ ఉంటుంది. అలాగే గడ్డల గుట్టగా శపించబడిన కొండపై మృతదేహాలు కనిపిస్తుంటాయి. ఈ మరణాలను గ్రామస్తులు దైవ న్యాయంగా భావిస్తుంటారు. కానీ వాటి వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకునే సాహసం ఎవరూ చేయరు. తరతరాలు వారందరూ పాటిస్తున్న సాంప్రదాయం వారిని స్వామికి విధేయులుగా ఉంటూ మౌనంగా కొనసాగేలా చేస్తుంది. దీంతో వారు బలవంతంగా, దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు.
మూఢనమ్మకాలతో నిండిన వింత ప్రపంచలాంటి వీరభద్రపురానికి సిటీ నుంచి ధైర్యమైన, విషయాన్ని తార్కికంగా ఆలోచించే యువతి వెన్నెల ( అన్నీ ) అడుగుపెడుతుంది. ఆమె వచ్చిన సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు దారుణంగా హత్యకు గురవుతాడు. దానిని వెన్నెలకు ప్రజలు దైవ శిక్షగా చెబుతారు. కానీ వెన్నెల మాత్రం వారి అంధ విశ్వాసాన్ని అంగీకరించదు. నిజాన్ని వెలికితీయాలనే ఆమె సంకల్పించుకుంటుంది. శతాబ్దాలుగా ఉన్న నమ్మకాల్ని సవాలు చేస్తుందిజ గతాన్ని దాచిపెట్టాలని చూసే శక్తివంతులైన వ్యక్తులతో ఆమె పోరాటాన్ని ప్రారంభిస్తుంది. వెన్నెల తన అన్వేషణలో గ్రామంలోని రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తుంది. భక్తి పేరుతో దాగి ఉన్న దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, తరతరాల భయాల వెనుక దాచిన చీకటి గతం బయటపడుతుంది.
1970ల కాలానికి వెళ్లి ఈ ఘటనల మూలాలను అన్వేషించటం ద్వారా ఈ గ్రామాన్ని నడిపిస్తున్న కథలు ఎలా శక్తి, ఆశ, మాయాజాలంతో రూపుదిద్దుకున్నాయో సిరీస్ నెమ్మదిగా బయటపెడుతుంది. ఇది విశ్వాసం, తర్కం మధ్య జరిగే గట్టిపోరు. ప్రతి సమాధానం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది, ప్రతి నిజం బయటపడే కొద్ది ఎవరూ ఊహించని వాస్తవాలు బయటకు రాబోతున్నాయనే ఉత్కంఠత పెరుగుతుంది. భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందంగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, అభినవ్‌గా ఎస్‌ఐ రవి, డా. నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష, నాంచారిగా అనురాధ, గురునాధన్‌గా బాలచంద్ర, బ్రహ్మంగా కల్కి, యంగ్ కార్తికేయగా హార్విన్ రెడ్డి కనిపించనున్నారు.