Entertainment

#Chiru158: చిరు ఆ పని చేశారో.. అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #ChiruBobby2 సినిమా గ్లింప్స్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. గ్లింప్స్‌లో కనిపించిన మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి లుక్, యాక్షన్ స్టైల్ చూసిన అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెంచుకుంటున్నారు.

#Chiru158: చిరు ఆ పని చేశారో.. అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #ChiruBobby2 సినిమా గ్లింప్స్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. గ్లింప్స్‌లో కనిపించిన మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి లుక్, యాక్షన్ స్టైల్ చూసిన అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. కొందరు అయితే ఇప్పటి నుంచే ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ హిట్ అవుతుందని జోస్యం చెబుతున్నారు. ఎవరి అంచనాలు వారివి. దీనిలో తప్పేమీ లేదు కానీ ఈ సినిమా గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. గ్లింప్స్‌కు వచ్చిన స్పందన ఒకవైపు ఎత్తైతే.. సినిమాలో హీరోయిన్ల ఎంపిక మరో ఎత్తు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నెటిజన్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం.. చిరుకు, హీరోయిన్‌కు మధ్య వయసు వ్యత్యాసం. ప్రస్తుతం చిరంజీవికి అనస్వర రాజన్ అయితే కూతురు పాత్రలో నటిస్తోందని టాక్. ఇక నివేద పేతురాజ్ గురించి మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ అియతే రాలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవికి నివేదా జోడీగా కనిపించనుందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చాలామంది నెటిజన్లు "చిరంజీవి తన వయసుకు తగ్గ కథలు, పాత్రలు ఎంచుకోవడం అభినందనీయమే. కానీ హీరోయిన్ ఎంపిక విషయంలో మాత్రం ఇలాంటి భారీ వయస్సు తేడాలు కనిపించడం ఆశ్చర్యంగా ఉంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు "నివేద వంటి యువ నటి కుటుంబ సభ్యురాలి పాత్ర వరకూ ఓకే కానీ ఒకవేళ రొమాంటిక్ ట్రాక్ ఉంటే ప్రేక్షకులకు మరీ దారుణంగా అనిపించే అవకాశం ఉంది" అని అంటున్నారు.

ఇంకొందరు మాత్రం సినిమా కథ గురించి పూర్తి వివరాలు తెలియకముందే విమర్శించడం సరైంది కాదని అంటున్నారు. పాత్రల స్వభావం, కథా నేపథ్యం, హీరోయిన్ల పాత్రల ప్రాధాన్యం ఏమిటనేది సినిమా విడుదలైన తర్వాత కానీ.. ఈలోగా ఏమైనా అప్‌డేట్స్ వస్తే కానీ స్పష్టంగా తెలియదని అంటున్నారు. మొత్తానికి ChiruBobby2 గ్లింప్స్‌తో సినిమా మీద ఆసక్తి పెరిగినప్పటికీ, హీరోయిన్ల ఎంపిక మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు కారణమైంది. అసలు సినిమాలో ఈ పాత్రల స్వరూపం ఏమిటి? చిరంజీవితో వీరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదల తర్వాతే దొరకనుంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 23, 2026 11:18 AM