Entertainment

Murali Mohan: ఈ వయసులో మురళీ మోహన్ ఇలా మారారేంటి?

మురళీ మోహన్‌ను ఫోటోను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది కదా.. ఆయనకు 86 ఏళ్లు. ఇంతకాలం పాటు సినిమాలు, వ్యాపారం, రాజకీయం అన్నింటి బాధ్యతలను చక్కగా నిర్వహించారు. ఇక ఈ వయసులో ఇంకేం ఇబ్బంది పడతాం అనుకున్నారో ఏమో కానీ..

Murali Mohan: ఈ వయసులో మురళీ మోహన్ ఇలా మారారేంటి?

మురళీ మోహన్‌ను ఫోటోను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది కదా.. ఆయనకు 86 ఏళ్లు. ఇంతకాలం పాటు సినిమాలు, వ్యాపారం, రాజకీయం అన్నింటి బాధ్యతలను చక్కగా నిర్వహించారు. ఇక ఈ వయసులో ఇంకేం ఇబ్బంది పడతాం అనుకున్నారో ఏమో కానీ పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టేశారు అనుకుంటున్నారా? కానే కాదండి బాబు. ‘వేదవ్యాస్’ అనే చిత్రంలో ఆయన గెటప్ అది. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సాయి ప్రగతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘వేద వ్యాస్’. ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర పోషించారు మురళీ మోహన్. ఆయనకు 86వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘వేదవ్యాస్’ చిత్రంలో ఆయన గెటప్‌ను చిత్ర నిర్మాత, మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి రివీల్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా "వేద వ్యాస్ " చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలిపారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 23, 2026 3:03 PM