Entertainment

సుధీర్ పేరు పలికేందుకు ఇష్టపడని రష్మి.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?

బుల్లితెరపై చాలా కాలం పాటు ఓ వెలుగు వెలిగారు యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్. ఈ జంటకు ఫ్యాన్స్ స్టార్ హీరోహీరోయిన్‌కు ఉన్నట్టుగా ఉన్నారు. అలాంటి ఈ జంటకు ఈ మధ్య ఏమైంది? ఎక్కడా జంటగా కనిపించడం లేదు.

సుధీర్ పేరు పలికేందుకు ఇష్టపడని రష్మి.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?

బుల్లితెరపై చాలా కాలం పాటు ఓ వెలుగు వెలిగారు యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్. ఈ జంటకు ఫ్యాన్స్ స్టార్ హీరోహీరోయిన్‌కు ఉన్నట్టుగా ఉన్నారు. అలాంటి ఈ జంటకు ఈ మధ్య ఏమైంది? ఎక్కడా జంటగా కనిపించడం లేదు. అయితే అయ్యిందిలే.. షోలు రావట్లేదనుకున్నారంతా కానీ తాజాగా ఓ షో ప్రమోషన్ వేదికపై రష్మి.. సుధీర్ పేరు పలికేందుకు సైతం ఇష్టపడకపోవడం ఆసక్తిని రేకెత్తించింది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అసలు వీరిద్దరికీ ఏమైంది? షోలు రావడం లేదా? లేదంటే వీరిద్దరే కలిసి చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

రష్మి, సుధీర్ ఏదైనా సాంగ్‌కు డ్యాన్స్ చేశారంటే అది మిలియన్ల కొద్దీ వ్యూస్.. వీరిద్దరూ సెటైర్లు వేసుకున్నా.. జోకులు పేల్చుకున్నా.. ఏం చేసినా కూడా వ్యూస్‌కి కొదువే ఉండదు. వీళ్లిద్దరి లవ్ ట్రాక్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. షో కోసం చేసినా కూడా అదంత రియలేనని జనాలు నమ్మారు. 2015 జబర్దస్త్ నుంచి ప్రారంభమైన వీరిద్దరి జర్నీ గత ఏడాది వరకూ బాగానే సాగింది. ఆ తరువాతే ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ కలిసి కనిపించడమే మానేశారు. ఇక తాజాగా ఆహాలో ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి సంబంధించి ఓ షో నిర్వహించనున్నారు. దానికి జ్యూరీలుగా మంచు లక్ష్మి, యాంకర్ రష్మి, వైవా హర్ష నిర్వహించనున్నారు.

ఈ షోలో నిర్వహించిన కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ పేరును పలికేందుకు సైతం రష్మి సంశయించింది. దీంతో ఓ రిపోర్టర్ అదేమని అడగ్గా.. షోకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలని చెప్పింది తప్ప ఆ ప్రశ్నకు సమాధానమే ఇవ్వలేదు. అది చూసిన వారంతా అసలు సుధీర్, రష్మిలకు ఏమైందంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. నెట్టింట ఇది హాట్ టాపిక్‌గా మారింది. అసలు వీరిద్దరి మధ్య వివాదమేంటి? కనీసం పేరు పలకలేనంత దూరం ఎందుకు పెరిగిందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత రష్మి, సుధీర్ జంట తిరిగి హాట్ టాపిక్‌గా మారింది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 24, 2026 1:48 PM