others

Hyderabad: వామ్మో.. ఇక్కడ ఫుడ్ తిన్నారో యమలోకంలో బెర్త్ కన్ఫర్మ్..!

ఇటీవలి కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పైకి అద్భుతమైన యాంబియెన్స్‌తో జనాలకు ఆకర్షిస్తున్న రెస్టారెంట్ల వికృత రూపం ఈ తనిఖీల్లో బయటపడుతోంది.

Hyderabad: వామ్మో.. ఇక్కడ ఫుడ్ తిన్నారో యమలోకంలో బెర్త్ కన్ఫర్మ్..!

బిజీ లైఫ్ కారణంగా అంతా హోటల్స్‌పైనే ఆధారపడుతున్నారు. ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే వస్తుంది. లేదంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి రెస్టారెంట్‌కు వెళుతున్నారు. లేదంటే ఫ్యామిలీతో స్మాల్ అవుటింగ్‌లో భాగంగా లంచ్ కూడా మంచి రెస్టారెంట్‌లో చేస్తున్నారు. ఆ మంచే మన కొంప ముంచుతోంది. హైదరాబాద్‌లోని దాదాపుగా ఏ రెస్టారెంట్ పరిస్థితి బాగోలేదు. పైకి వింతగా.. అద్భుతంగా అనిపిస్తుంది. కిచెన్‌లోకి వెళితే కానీ తెలియదు ఎంత కంపు కొడుతోందనేది. ఇది ఏ ఒక్క రెస్టారెంట్‌కి మాత్రమే పరిమిం కాదు.. అన్నీ అలాగే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పైకి అద్భుతమైన యాంబియెన్స్‌తో జనాలకు ఆకర్షిస్తున్న రెస్టారెంట్ల వికృత రూపం ఈ తనిఖీల్లో బయటపడుతోంది.

తాజాగా కొండాపూర్ ఏఎంబీ మాల్ ఎదురుగా ఉన్న జాయకా ఫుడ్ కోర్టులో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అక్కడైతే కనీసం ఫ్రీజర్ కూడా పని చేయడం లేదు. దానిలోనే ఆహార పదార్థాలను నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెస్టారెంట్ కిచెన్‌‌లో ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. పైగా ఎలుకల బొరియలు, ఎలుకలు కొరికిన ఆహార పదార్థాలు చూసి అధికారులు షాకయ్యారు. ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ నిల్వ చేసే ప్రదేశాల్లో ఎలుకల రెట్టలు... ఫ్రీజర్‌‌లో పాచిపోయిన చికెన్ బిర్యానీ, పాడైపోయిన కూరగాయలను నిల్వ చేశారు. స్టారెంట్ నిర్వాహకులపై అధికారులు ఫైర్ అవడమే కాకుండా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌‌ను సైతం సస్పెండ్ చేశారు. ఈ ఫుడ్ కోర్ట్‌ తనిఖీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇలాంటి చోట్ల ఫుడ్ తింటే యమలోకంటే బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనని జనాలు అనుకుంటున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 26, 2026 6:00 AM