పాపం అమ్మడు.. నిర్మాతను ఏమన్నదో కానీ గట్టిగానే ఫోకస్ చేశాడు..!
అమ్మడు క్షణం తీరికలేనంత బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్‌లో ఈ ముద్దుగుమ్మ గురించి ఊహించని ప్రచారం ప్రారంభమైంది. ఇంతకూ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టిందెవరో తెలిస్తే షాక్ అవుతారు.
టాలీవుడ్‌లో సక్సెస్ అయితే చాలు.. అటు నుంచి అన్నీ ఉడ్‌లూ చుట్టేయవచ్చన్నది ముద్దుగుమ్మల ఆలోచన. అందుకే టాలీవుడ్‌లో అవకాశం కోసం తపిస్తూ ఉంటారు. అలా పంజాబ్ నుంచి వచ్చిన ఓ బ్యూటీ టాలీవుడ్‌లో అవకాశం కొట్టేసి వరుస విజయాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో అవకాశాలు ఆగుతాయా? పరిగెత్తుకుంటూ వచ్చాయి. అమ్మడు క్షణం తీరికలేనంత బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్‌లో ఈ ముద్దుగుమ్మ గురించి ఊహించని ప్రచారం ప్రారంభమైంది. ఇంతకూ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టిందెవరో తెలిస్తే షాక్ అవుతారు.
ముందుగా అమ్మడి గురించి ప్రచారమేంటంటే.. ఆమెకు తలపొగరు ఎక్కువైందట. ఎవ్వరి మాటా వినట్లేదట. చివరకు డైరెక్టర్‌ని కూడా ఛీ పో అనేస్తోందట. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. వాస్తవానికి ఆ హీరోయిన్ పంక్చువాలిటీకి క్వీన్. టైమ్‌కి షూటింగ్‌కి రావడం.. వచ్చీరాగానే సీన్ పేపర్ తీసుకుని రెడీ అవడం.. షాట్ రెడీ అయ్యే సమయానికి మేకప్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చేస్తుందట. తనకు పెరుగుతున్న క్రేజ్‌కు అనుగుణంగా భారీగా పారితోషికాన్ని సైతం పెంచలేదని చెబుతారు. పద్ధతిగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. మరి అంత మంచి హీరోయిన్‌పై ఈ రూమర్స్ ఏంటంటారా?
ఇండస్ట్రీలో కాలనాగులకు కొదువేముంది? అడుగడుగునా ఉంటాయి కదా. అలాంటి కాలనాగే ఓ నిర్మాత అని టాక్. కావాలని పనిగట్టుకుని మరీ పాపం ఆ ముద్దుగుమ్మపై విష ప్రచారం చేయిస్తున్నాడని టాక్. కొందరు హీరోలు, ఇతర నిర్మాతలకు తనే స్వయంగా కాల్ చేసి మరీ ఆ హీరోయిన్ గురించి విష ప్రచారం చేస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఆ హీరోయిన్‌ను ఏదో అడిగి ఉంటాడు. ఆమె ఛీ కొట్టడంతో మనోభావాలు దెబ్బతిని ఇలాంటి ప్రచారం చేస్తున్నాడని టాక్. వాస్తవానికి ఆ నిర్మాత సాధారణమైన వ్యక్తేం కాదు. ఇండస్ట్రీపై గట్టి పట్టే ఉంది. గట్టిగా ఫోకస్ చేశాడంటే.. టాలీవుడ్‌లో ఆ హీరోయిన్‌కు అవకాశాలు రావడం కష్టమే. ఏం జరుగుతుందో చూడాలి.