Entertainment

Chiranjeevi: కొడుకు కోసం అల్లు అర్జున్‌ని చిరు దారుణంగా అవమానించారా?

కొడుకు రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్‌ని మెగాస్టార్ చిరంజీవి దారుణంగా అవమానించారా? అసలు ఈ చర్చఎందుకు ప్రారంభమైంది. ఒక్క మాటలో అన్ని అర్థాలుంటాయా? ప్రతి దానిలోనూ నానార్థాలు, పరమార్థాలు వెతకాలా?

Chiranjeevi: కొడుకు కోసం అల్లు అర్జున్‌ని చిరు దారుణంగా అవమానించారా?

కొడుకు రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్‌ని మెగాస్టార్ చిరంజీవి దారుణంగా అవమానించారా? అసలు ఈ చర్చఎందుకు ప్రారంభమైంది. ఒక్క మాటలో అన్ని అర్థాలుంటాయా? ప్రతి దానిలోనూ నానార్థాలు, పరమార్థాలు వెతకాలా? అసలేం జరిగిందంటే.. ‘పెద్ది’ విజయోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆ సభలో ఆయన మాట్లాడిన ఒక్క మాట ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్‌నే క్రియేట్ చేసింది. చిరంజీవి అసలు ఏమన్నారంటే.. నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్‌కు అది రావడం, రాకపోవడం అసలు సమస్యే కాదని, తెచ్చుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయని అన్నారు.

నేషనల్ అవార్డ్ తెచ్చుకునేందుకు ఎన్నో దారులున్నాయని అనడమే వార్‌కు కారణమైంది. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలకు ట్రిగ్గర్ అయిపోయింది. అల్లు అర్జున్ గతేడాది పుష్ప సినిమాకు గానూ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించిన ఒకే ఒక్క నటుడు అల్లు అర్జున్ కావడంతో ఆయన ఫ్యాన్సే కాదు.. యావత్ తెలుగు సినీ అభిమానులంతా సంబరపడ్డారు. కానీ తాజాగా చిరు నేషనల్ అవార్డును తెచ్చుకునేందుకు ఎన్నో దారులున్నాయనడంతో బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చిరు స్టేట్‌మెంట్‌ ఏమీ ఇవ్వలేదు. అదేదో క్యాజువల్‌గా అన్నారంతే. ఒకరిని ఉద్దేశించి అన్న మాట కూడా కాదు కానీ.. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా ట్రిగ్గర్ అయ్యారు.

ఇక్కడ దారులు అంటే కేవలం దొడ్డిదారులు అనే కోణంలోనే చూడాలా? వాస్తవానికి పుష్ప అల్లు అర్జున్ నటనకు ఎవరైనా వంక పెట్టగలరా? నటించలేదు.. జీవించాడు. ఒక ఆర్టిస్టుకి జాతీయ అవార్డు రావాలంటే అవతల ప్రత్యర్థి అంటూ ఉండకూడదు. ఇది ప్రధానాంశం. ఏమో రేపు ‘పెద్ది’కి రామ్ చరణ్ కూడా రావొచ్చేమో. రామ్ చరణ్ ఏమైనా తక్కువగా నటించారా? ఆ సినిమా చూడాలంటే ఉన్న సానుకూల అంశాల్లో ప్రధానాంశం రామ్ చరణ్ నటనే. అలాంటి రామ్ చరణ్‌కు గట్టి పోటీ లేకుంటే నేషనల్ అవార్డ్ వరించవచ్చేమో. వాస్తవానికి ‘పుష్ప’లో అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ ప్రకటించినప్పుడు సంతోషపడిన వారిలో చిరంజీవి ప్రథముడనే చెప్పాలి. అలాంటి వ్యక్తి బన్ని అవార్డును తప్పుబడతారా? ఆ మాటకొస్తే ఆ దారులు తెలియక ఆయన ఇంతకాలం నేషనల్ అవార్డును అందుకోలేదా? కోడిగుడ్డుపై ఈకలు లాగుతూ పోతే ఎలా?

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 25, 2026 5:18 AM