Entertainment Breaking News

‘ఇండస్ట్రీ హిట్’ శివ కుమార్‌కు అరుదైన గౌరవం

ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార వ్యవస్థ అనేది కొత్తపుంతలు తొక్కుతోంది. దానిని అనుసరిస్తూ క్షణాల్లో కంటెంట్‌ను జనాల చేతుల్లో పెడితేనే ఈ రంగంలో నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా సినీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

‘ఇండస్ట్రీ హిట్’ శివ కుమార్‌కు అరుదైన గౌరవం

ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార వ్యవస్థ అనేది కొత్తపుంతలు తొక్కుతోంది. దానిని అనుసరిస్తూ క్షణాల్లో కంటెంట్‌ను జనాల చేతుల్లో పెడితేనే ఈ రంగంలో నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా సినీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎప్పటికప్పుడు సినిమా వార్తలను అట్రాక్టివ్ హెడ్‌లైన్‌తో.. జనాలకు అందించాల్సి ఉంటుంది. దీని వెనుక ఎందరో కంటెంట్ క్రియేటర్లు, జర్నలిస్టులు, ఎడిటర్ల శ్రమ దాగి ఉంది. వారి ప్రతిభను గుర్తించి గౌరవించేందుకు వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక “డిజిటల్ మీడియా అవార్డ్స్ 2026” ప్రధానోత్సవానికి తెరదీసింది. తాజాగా ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ 2026 అవార్డుల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ వెబ్‌సైట్ ఎడిటర్ అవార్డ్” (Best Website Editor Award)ను ప్రముఖ సినీ పోర్టల్ ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత శివ కుమార్ బోయిదాపు (Shiva Kumar Boidapu) అందుకున్నారు. తెలుగు డిజిటల్ జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన శివ.. వేగంగా వార్తలను, సినిమాలకు సంబంధించిన రివ్యూలను అందించడమే కాకుండా వాటి వెనుక ఉన్న యదార్థాలను సైతం విశ్లేషణాత్మకంగా పాఠకులకు చేరవేస్తున్నారు. సినిమా కంటెంట్ అయినా, సామాజిక అంశాలైనా ఆయన కథనాల్లో స్పష్టమైన నిజాయితీ, వెబ్‌సైట్ ప్రెజెంటేషన్, ఆకర్షణీయమైన హెడ్డింగ్స్, కంటెంట్ స్ట్రక్చర్ తదితర అంశాల నిర్వహణలో శివకుమార్ దిట్ట.

సంచలనం కోసం చేసే ‘క్లిక్‌బైట్’ వార్తలకు దూరంగా ఉండటం శివకుమార్ ప్రత్యేకత. యువ జర్నలిస్టులకు డిజిటల్ మీడియా ఎథిక్స్‌పై అవగాహన కల్పిస్తూ ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ, వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది. సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి చేతుల మీదుగా శివ 'బెస్ట్ వెబ్సైట్ ఎడిటర్ అవార్డ్‌ను అందుకున్నారు. ఈ పురస్కారాల వేడుక డిజిటల్ క్రియేటర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా తాము చేసే హార్డ్ వర్క్‌కు తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత బాధ్యతాయుతమైన, క్వాలిటీ కంటెంట్‌ను సృష్టించేందుకు యువతకు ఇది స్ఫూర్తినిస్తుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 25, 2026 2:46 AM