Samantha: నోరు జారి నిజం చెప్పిన సమంత.. ఇది సామ్ లీక్స్..
చిరు లీక్స్ గురించి మనకు తెలుసు. చాలా సందర్భాల్లో ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. ఒకసారి తన సినిమా తనే నోరు జారి అనౌన్స్ చేశారు. తాజాగా సమంత గురించి కూడా ఆయన లీక్ ఇచ్చారు. సమంత గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
చిరు లీక్స్ గురించి మనకు తెలుసు. చాలా సందర్భాల్లో ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. ఒకసారి తన సినిమా తనే నోరు జారి అనౌన్స్ చేశారు. తాజాగా సమంత గురించి కూడా ఆయన లీక్ ఇచ్చారు. సమంత గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అది నిజమా? కాదా? అన్న సందేహంలో జనాలు ఉన్నారు. తాజాగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ ప్రెస్‌మీట్‌లో నోరు జారి ఆ న్యూస్‌ను కన్ఫర్మ్ చేసింది. దీనిని సామ్ లీక్స్ అనాలేమో. అసలు విషయం ఏంటంటే.. కొన్ని రోజులుగా సమంత ప్రెగ్నెంట్ అంటూ.. ఆమె బేబి బంప్‌ను చూడాలంటూ చాలా మంది వీడియోస్ సైతం షేర్ చేశారు. ఇది ఎంతవరకూ నిజం? అసలే మనం ఏఐ కాలంలో ఉన్నాం ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియని సందిగ్ధంలో ఉన్నాం.
ఈ తరుణంలోనే ‘మా ఇంటి బంగారం’ టీం చిరును కలిసేందుకు వెళ్లింది. ఆ తరువాత చిరు ట్విటర్ వేదికగా.. లీక్ ఇచ్చేశారు. ‘కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు కంగ్రాట్స్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక తాజాగా సమంత కూడా తను ప్రెగ్నెంట్ అని చెప్పేసింది. ‘మా ఇంటి బంగారం ‘ సక్సెస్ మీట్ బుధవారం (జూన్ 24) హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం తాను మెటర్నిటీ లీవ్‌లో ఉన్నానని చెప్పేసింది. దీంతో అక్కడ ఉన్న జర్నలిస్టులంతా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. దానికి సామ్ కూడా థాంక్యూ చెప్పింది. ఈ వీడియో కాస్తా క్షణాల్లో బయటకు వచ్చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు సమంత, రాజ్ నిడుమోరు దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.