Entertainment

Maheshbabu: రాజమౌళికి తలనొప్పిగా తయారైన మహేశ్.. ఇక సినిమా అయినట్టే..!

రాజమౌళికి మహేశ్ తలనొప్పిగా తయారయ్యాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? అనేది సందేహమేనని నెటిజన్లు అంటున్నారు.

Maheshbabu: రాజమౌళికి తలనొప్పిగా తయారైన మహేశ్.. ఇక సినిమా అయినట్టే..!

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? తీసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు. ఆయన స్టైలే వేరు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు. అలా సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ‘వారణాసి’ సినిమా ప్రారంభించడానికి ముందే అందరి పాస్‌పోర్టులూ కలెక్ట్ చేసుకుని తన దగ్గర పెట్టేసుకున్నారు. కానీ మహేశ్ ఊరుకుంటారా? ఆ తరువాత తన పాస్‌పోర్టు తీసుకుని ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్లాడు. అంతటితో ఆగితే బాగానే ఉండు.. మరో ట్రిప్ అంటూ చెక్కేశాడు. దీంతో నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం ఫ్రాన్స్ వెళ్లాడు. మహేశ్ ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్టులో ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రారంభంలో రాజమౌళి ఓ ఫోటో రిలీజ్ చేశారు. దానిలో మహేష్ పాస్ పోర్టును సీజ్ చేస్తున్నట్టు, సింహాన్ని బోనులో బంధించినట్టు సింబాలిక్‌ ఫోటో అది. ఆ తరువాత మహేశ్ ఎప్పటికప్పుడు విదేశాలకు జంప్ అవుతూనే ఉన్నాడు. ఈ సమ్మర్‌లోనే ఇది రెండవ ట్రిప్ కావడం గమనార్హం. ఇలా మహేశ్ ట్రిప్పుల మీద ట్రిప్పులేస్తుంటే ‘వారణాసి’ పరిస్థితేంటి? ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ను మంచు ఖండమైన అంటార్కిటికాలో రాజమౌళి ప్లాన్ చేశారు.

ఇలాంటి తరుణంలో మహేశ్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఓవైపు విజువల్ వండర్‌గా తెరకెక్కే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. మహేశ్ ట్రిప్పులతో సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాజమౌళికి మహేశ్ తలనొప్పిగా తయారయ్యాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? అనేది సందేహమేనని నెటిజన్లు అంటున్నారు. మరికొందరేమో.. మహేశ్ విదేశాలకు వెళ్లినా కూడా షూటింగ్ అయితే ఆగదని.. ఆయనతో సంబంధం లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. జులై రెండో వారం నుంచి మహేశ్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 26, 2026 3:21 AM