సోషల్‌మీడియాలో జూన్ థియరీ ట్రెండ్.. జూన్‌కు, ప్రేమకు సంబంధమేంటి?
జూన్ నెల ప్రేమ జీవితాలలో కొత్త మలుపులు, కొత్త సంబంధాలు, గణనీయమైన మార్పులను తీసుకువస్తుందట. అసలు ఇది ఇంతలా ఎందుకు వైరల్ అయ్యిందంటే..
ఆధునిక డేటింగ్ ప్రపంచంలో సోషల్ మీడియాలో 'జూన్ థియరీ' అనే ఒక ట్రెండ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్. అసలేంటీ జూన్ థియరీ.. జూన్ ఎండింగ్‌కి వచ్చాం కదా ఇంకేంటంటారా? ఇంకో మూడు రోజులు ఉంది కదా. అద్భుతం అనేది ఎప్పుడైనా జరగొచ్చు. జూన్ నెల ప్రేమ జీవితాలలో కొత్త మలుపులు, కొత్త సంబంధాలు, గణనీయమైన మార్పులను తీసుకువస్తుందట. అసలు ఇది ఇంతలా ఎందుకు వైరల్ అయ్యిందంటే.. చాలా మంది నెటిజన్లు తమ జూన్ మాసానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. దీంతో ఈ థియరీ మరింత వైరల్ అవుతోంది. కొందరైతే ఈ జూన్ మాసానికి కొత్త పేరు కూడా ఇచ్చేశారు. అదేంటంటే.. ప్రేమ మాసం అట.
మరికొందరేమో దీనిని ఒక కొత్త ప్రారంభానికి సంకేతమని చెబుతున్నారు. అయితే ఈ జూన్ థియరీకి ఎలాంటి శాస్త్రీయ ఆధారమూ లేదు. అయినా కూడా ముఖ్యంగా దీనికి యూత్ నుంచి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ సిద్ధాంతానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ, ఆన్‌లైన్‌లో దీని ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. అసలేంటీ జూన్ థియరీ? అంటే.. న్యూ ఇయర్ వచ్చీ రాకముందే రకరకాల రిజల్యూషన్స్ చేసుకుంటాం. మరి దానిని పాటిస్తామా? లేదా? అనేది సెకండరీ. ఇక అక్టోబర్, నవంబర్ వచ్చిందంటే కూల్ క్లైమేట్‌ను ఎంజాయ్ చేస్తాం. ఈ రెండింటికీ మధ్య కాలంలో వచ్చేదే ‘జూన్ థియరీ’. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరికొత్త ఆసక్తికరమైన సిద్ధాంతమిది. ఈ థియరీ సారాంశమేంటంటే.. జూన్ నెల మీ ప్రేమ జీవితంలో మ్యాజిక్ చేస్తుందని అర్థమట.
మరి ఈ థియరీ కేవలం యూత్ చెబుతున్నదేనా? లేదంటే కొందరి అనుభవాలు చెబుతున్నదేనా? అంటే కాదు.. దీని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు సైతం ఉన్నాయంటున్నారు. జూన్‌లో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బయట గడిపే సమయం కూడా పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో అధిక ఎండల కారణంగా మన ఒంట్లో సెరిటోనిన్ స్థాయి సైతం పెరుగుతుందట. తద్వారా మన మూడ్, ఆత్మవిశ్వాసం మెరుగుపడి.. బయటకు వెళ్లడం, కొత్త వ్యక్తులను కలవడం వంటివి ఎక్కువవుతాయట. అందుకే ఈ నెలలో ఎన్నో ప్రేమకథలు చిగురిస్తాయట. ఇదండీ జూన్ థియరీ వెనుకున్న శాస్త్రీయ కోణం. మరి మీరేమంటారు?