Entertainment

Bahubali 3: అప్పటికి రెడ్డెవరో.. రాజెవరో.. అది అవదమ్మ అంటున్న నెటిజనం..!

దర్శకధీరుడు రాజమౌళితో అంత ఈజీ ఏం కాదు.. ఇలా అంటే అలా అయిపోవడానికి. నిన్నటి నుంచి ‘బాహుబలి 3’ ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు ఎక్కడ చూసినా తెగ వైరల్ అవుతున్నాయి.

Bahubali 3: అప్పటికి రెడ్డెవరో.. రాజెవరో.. అది అవదమ్మ అంటున్న నెటిజనం..!

దర్శకధీరుడు రాజమౌళితో అంత ఈజీ ఏం కాదు.. ఇలా అంటే అలా అయిపోవడానికి. నిన్నటి నుంచి ‘బాహుబలి 3’ ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు ఎక్కడ చూసినా తెగ వైరల్ అవుతున్నాయి. కానీ అది అయ్యేదేనా? ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ సినిమాను తీర్చిదిద్దడంలో బిజీ.. 2027 వరకూ నో ఛాన్స్. మరోవైపు ప్రభాస్ ఏమైనా తక్కువ తిన్నాడా? నాలుగాకులు ఎక్కువే. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 మూవీస్ లైన్‌లో పెట్టుకుని కూర్చొన్నాడు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు అయ్యేవి కావు. రానా అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కాబట్టి ‘బాహుబలి 3’ కోసం ఎప్పుడంటే అప్పుడు డేట్స్ సెట్ చేయగలడు. కానీ రాజమౌళికి 2028 వరకూ అవదు. ఒకవేళ ఆ తరువాత ప్రారంభించినా కూడా ప్రి ప్రొడక్షన్ వర్క్ కోసం కనీసం ఓ ఏడాది తీసుకుంటారు. అంటే మూడేళ్ల తర్వాత రాజమౌళి ఫ్రీ అన్నమాట.

మరి ప్రభాస్ మాటేంటి? నాలుగు సినిమాలు అవ్వాలంటే అది సాధ్యమయ్యేదేనా? ఎప్పటికి అవుతుంది? అసలు అప్పటికి రెడ్డెవరో.. రాజెవరో.. ఏమీ ఆలోచించకుండా ‘బాహుబలి 3’ వచ్చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తా ఛానళ్లు గగ్గోలు పెడుతున్నాయి. అనుష్క సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె స్థానంలో వేరొకరిని తీసుకుంటే తీసుకోవచ్చు కానీ మిగిలిన క్యాస్టింగ్‌తో పాటు సెట్స్ వేయడం అన్నీ చిటికేస్తే అయిపోతాయా? అసలే రాజమౌళి. పర్ఫెక్షన్ లేకుంటే దేనిని ఓ పట్టాన అంగీకరించరు. మరి అలాంటి వ్యక్తి ఎప్పటికి సెట్స్ ఓకే చేస్తారు. అబ్బే అదంతా అయ్యేది కాదమ్మా అని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎప్పటికనేది కూడా చెప్పడం కష్టమే. కానీ ఈ ప్రకటన మాత్రం ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ అయితే నింపేసింది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 27, 2026 11:06 AM