Bhagyaraj: కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే ఇక లేరు.. గురువు వెనుకే తిరిగిరాని లోకాలకు..
తమిళ సినీ పరిశ్రమకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకుడు భారతీరాజా మరణ వార్త విని 17 రోజులు కూడా కాకముందే మరో దిగ్గజ దర్శకుడి ఆకస్మిక మరణం కోలీవుడ్‌ను విషాదంలో ముంచెత్తింది.
తమిళ సినీ పరిశ్రమకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకుడు భారతీరాజా మరణ వార్త విని 17 రోజులు కూడా కాకముందే మరో దిగ్గజ దర్శకుడి ఆకస్మిక మరణం కోలీవుడ్‌ను విషాదంలో ముంచెత్తింది. భారతీరాజా శిష్యుడైన కె. భాగ్యరాజ్ (73) నేటి ఉదయం ఆకస్మికంగా కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుకు గురై ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 1953 జనవరి 7న భాగ్యరాజ్ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో నటుడిగా.. దర్శకుడిగా తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు.
భాగ్యరాజ్ మృతితో తమిళ సినీ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవలే భారతీరాజా మరణించారు. ఆయన మరణం నుంచి సినీ పరిశ్రమ కోలుకోకముందే మరో దిగ్గజ దర్శకుడి మృతి ఇండస్ట్రీని కలచి వేస్తోంది. భాగ్యరాజ్‌ను కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తారు. తెలుగులో అల్లరినరేష్ నటించిన 'పెళ్లైంది కానీ'.. వెంకటేష్ క్లాసిక్ హిట్స్ 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'అబ్బాయిగారు', నాగార్జున నటించిన 'ఆఖరి పోరాటం' వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, కథ అందించారు. దీంతో భాగ్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు.