Entertainment

మాదిగ బిర్యాని హౌస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోందిగా..!

చౌదరి మెస్ ఉండొచ్చు.. రెడ్డి హాస్టల్.. నాయుడిగారి బిర్యానీ.. బ్రాహ్మణ భోజనం.. బిస్మిల్లా బిర్యానీ.. ఇలా కులపిచ్చి తినే తిండికీ ఎక్కేసింది. ఇంతకు ముందు కమ్మగా తిన్నాం అనేవాళ్లు. ఇప్పుడు కమ్మవారి మెస్‌లో తిన్నాం అంటున్నారు.

మాదిగ బిర్యాని హౌస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోందిగా..!

చౌదరి మెస్ ఉండొచ్చు.. రెడ్డి హాస్టల్.. నాయుడిగారి బిర్యానీ.. బ్రాహ్మణ భోజనం.. బిస్మిల్లా బిర్యానీ.. ఇలా కులపిచ్చి తినే తిండికీ ఎక్కేసింది. ఇంతకు ముందు కమ్మగా తిన్నాం అనేవాళ్లు. ఇప్పుడు కమ్మవారి మెస్‌లో తిన్నాం అంటున్నారు. బ్రాహ్మణ భోజనం వెరీ స్పెషల్ అంటున్నారు. హిందువులకూ.. ముస్లింలకూ ఉన్నప్పుడు మనకెందుకు బిర్యానీ హౌస్ ఉండకూడదనుకున్నారో ఏమో కానీ మాదిగ బిర్యాని హౌస్‌ను కూడా వెలిపించారు. మన అదృష్టం కొద్దీ పీల్చే గాలికి కులం లేదు. లేదంటే ఫలానా కులం వాళ్లే ఆ గాలి పీల్చాలనే కండీషన్ పెట్టేవారు. భూమికి భారం పూర్తిగా తగ్గిపోయేది.

అసలా బోర్డ్ చూస్తుంటే కులపిచ్చి పీక్స్‌కు వెళ్లిందా? లేదంటే.. దిక్కుమాలిన ఏఐ చేసిన ఘోరాల్లో ఇది కూడా ఒకటా అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ ఫోటో అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దానిని చూసిన వారంతా అసలు ఈ మాదిగ బిర్యానీ హౌస్ ఎక్కడుంది? ఎవరు పెట్టారు? ఎప్పుడు పెట్టారంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ సమాధానం దొరకకపోవడంతో ఇదంతా ఏఐ పుణ్యమని కొందరు అంటున్నారు. ఒకవేళ నిజంగా ఉంటే.. గూగుల్ మొత్తాన్ని జల్లెడ పట్టేశాం. అప్పుడైనా దొరకాలి కదా అంటున్నారు. ఇది కూడా పాయింటే. దాదాపుగా అంతా ఏఐ సృష్టేనని అంటున్నారు. మొత్తానికి ఎవరికో ఒకరికి మాత్రం ఇది గొప్ప ఐడియానే కావొచ్చు కూడా. రేపో మాపో వెలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 26, 2026 1:23 PM