Politics

Kethan Agarwal Murder Case: బాబోయ్ బట్టతల ఉందని.. కాబోయే భర్తను చంపేసిందట..

యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతనికి కాబోయే భార్య సియా గోయల్ అతడిని లోయలోకి నెట్టి చంపేసింది. తాజాగా పోలీసుల విచారణలో ఆమె చెప్పిన విషయాలు వింటే విస్తుబోవడం ఖాయం

Kethan Agarwal Murder Case: బాబోయ్ బట్టతల ఉందని.. కాబోయే భర్తను చంపేసిందట..

యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతనికి కాబోయే భార్య సియా గోయల్ అతడిని లోయలోకి నెట్టి చంపేసింది. తాజాగా పోలీసుల విచారణలో ఆమె చెప్పిన విషయాలు వింటే విస్తుబోవడం ఖాయం. కేతన్ తనకు నచ్చలేదని.. అతను నచ్చపోవడానికి కారణాల్లో ఒకటి అతనికి బట్టతల ఉండటమని తెలిపింది. చివరకు కేతన్ పెట్టుకునే విగ్గు కూడా తనకు నచ్చలేదని సియా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించడంతో ఇది కాస్తా సంచలనంగా మారింది. తనకు అతను నచ్చలేదని ఇంట్లో గట్టిగా చెప్పేస్తే అయిపోయే దానికి.. బట్టతల ఉందని.. విగ్గు నచ్చలేదని కాబోయే వాడిని చంపేయం షాకింగ్‌గా ఉంది.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో .. సియా గోయల్ ప్రియుడు చేతన్ చౌదరి ప్రోత్సాహమే కీలకమని తెలుస్తోంది. వారిద్దరూ కలిసి కుట్ర పన్ని, జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్‌ను తోసి చంపేసిన విషయం తెలిసిందే. హుడీతో వచ్చి పోలీసులకు చేతన్ అడ్డంగా దొరికిపోయాడు. అసలు కేతన్‌ను చంపాలని ప్లాన్ చేసిందే.. చేతన్ అని తెలుస్తోంది. అందులో భాగంగా విగ్గు అంశాన్ని చెప్పి సియాను చేతన్ బాగా రెచ్చగొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత ప్లాన్ ప్రకారం.. జూన్ 19న కేతన్‌ను సియా గొడవ పెట్టి మరీ లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. అక్కడ క్లిఫ్ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత చేతన్‌కు సియా సిగ్నల్ ఇచ్చింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం అగర్వాల్‌ను తోసివేసి చంపేశారని పోలీసులు చెప్పారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 26, 2026 1:47 PM