Politics

PM Modi: మోదీ-మెలోని కలిస్తే వైరలే.. మరోసారి నెట్టింట మెలోడి సందడి

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ దేశాల అగ్రనేతలు ఒకచోట చేరినా కూడా సోషల్ మీడియా మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపైనే దృష్టి పెట్టింది.

PM Modi: మోదీ-మెలోని కలిస్తే వైరలే.. మరోసారి నెట్టింట మెలోడి సందడి

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ దేశాల అగ్రనేతలు ఒకచోట చేరినా కూడా సోషల్ మీడియా మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపైనే దృష్టి పెట్టింది. గతంలో ఓసారి వీరిద్దరి జంట నెట్టింట ట్రెండ్ సెట్ చేయగా.. మరోసారి ఇద్దరూ వైరల్ అవుతున్నారు. జీ-7 సమావేశం సందర్భంగా నాయకులంతా గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఆ సమయంలో ప్రధాని మోదీ, జార్జియా మెలోని కలిశారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా మెలోని మాట్లాడుతూ, “మిమ్మల్ని మళ్లీ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే ఫేమస్ కపుల్” అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాని మోదీ ఇన్‌స్టాలో పాపులారిటీపై స్పందించినట్టుగా తెలుస్తోంది. మరోసారి ఈ జంట నెట్టింట క్షణాల్లో వైరల్ అయిపోయింది. అంతేకాకుండా మిలయన్ల కొద్దీ వ్యూస్‌తో దీనికి సంబంధించిన వీడియో దూసుకుపోతోంది.

మోదీ, మెలోని జంటను నెట్టింట ‘మెలోడి’గా పిలుస్తుంటారు. గత మూడేళ్ల ఈ మెలోడీ అనే పదం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తొలుత 2023లో దుబాయ్‌లో జరిగిన COP28 సదస్సు సందర్భంగా ‘మెలోడి’ మ్యాజిక్ ప్రారంభమైంది. అప్పట్లో మోదీ, మెలోని కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “Good Friends at COP28 #Melodi” అని పోస్ట్ పెట్టారు. ఈ మెలోడి హ్యాష్‌ట్యాగ్ వెంటనే వైరల్ అయిపోయింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు దీనిని ట్రెండ్‌గా మార్చారు. అంతటితో మోదీ ఆగారా? ‘మెలోడీ’ పేరుకు వచ్చిన ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని, రోమ్ పర్యటనలో మెలోనికి ‘Melody’ టాఫీల ప్యాకెట్‌ను బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోని మెలోని ఇన్‌స్టాలో షేర్ చేశారు. దానికి కూడా భారీగా నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వచ్చింది. “ప్రధానమంత్రి మోదీ మాకు చాలా రుచికరమైన క్యాండీ తీసుకొచ్చారు” అని మెలోని పోస్ట్‌లో పేర్కొంటూ.. ఇద్దరు నాయకులు నవ్వుకున్న దృశ్యాలు నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 17, 2026 10:28 AM