Vadde Naveen: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ క్లైమాక్స్ వరకూ గ్రిప్పింగ్‌గా వెళుతుంది..
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాలోని పాయింట్, కథ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుందని... ముఖ్యంగా కథ తనకు చాలా నచ్చిందన్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని.. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుందని వడ్డే నవీన్ తెలిపారు.
వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమాతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం వడ్డే నవీన్ మీడియాకు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తీరు మారింది..
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాలోని పాయింట్, కథ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుందని... ముఖ్యంగా కథ తనకు చాలా నచ్చిందన్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని.. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుందని వడ్డే నవీన్ తెలిపారు. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారిందని.. కేవలం కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాల్ని ఇస్తే సరిపోవడం లేదన్నారు. అన్ని అంశాల్ని జోడించి సరికొత్త పాయింట్, కంటెంట్‌ను అందిస్తేనే ఆదరిస్తున్నారన్నారు. ఈ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో కొత్త కంటెంట్ ఉంటూనే.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తెరకెక్కించినట్టుగా వడ్డే నవీన్ వెల్లడించారు.
రెగ్యులర్‌గా ఉండదు..
రీ ఎంట్రీలో తానే నిర్మాతగా మారడానికి కారణం కథేనన్నారు. వేరే నిర్మాత అయితే కథ మారుస్తారని కాదు కానీ ఈ కథని తాను పూర్తిగా నమ్మానన్నారు. దీంతో నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చానని నవీన్ తెలిపారు. ఇక సినిమా విషయానికి వస్తే త్రిమూర్తులు పాత్రలోనే ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నారు. కానిస్టేబుల్ పాత్రకి తగ్గట్టుగానే ఇందులో కనిపిస్తానని.. ఈ సినిమా అయితే ప్రేక్షకులు ఊహించినట్టుగా రెగ్యులర్‌గా ఉండదన్నారు. సిస్టంలో ఉంటూనే పోరాడే కానిస్టేబుల్ పాత్రలో తాను కనిపిస్తానన్నారు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చాలా వరకు రియలిస్టిక్‌గానే ఉంటుందన్నారు. పూర్తిగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా ఉండదని... అవసరం ఉన్న చోట మాత్రమే ఫైట్, పాటలను పెట్టినట్టు వెల్లడించారు.
సమస్య రాలే..
నిర్మాణంలో అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పులపై వడ్డే నవీన్ మాట్లాడుతూ.. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందని... నిర్మాణంలోనూ చాలా మార్పులు వచ్చాయని వడ్డే నవీన్ తెలిపారు. అయితే అన్నీ పక్కాగా ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎక్కడా ఎలాంటి సమస్య రాలేదన్నారు. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. ఇప్పటికే జీ టీం ఓటీటీ హక్కుల్ని తీసుకుందని తెలిపారు. కమల్ ఈ కథ మీద చాలా వర్క్ చేశాడని.. తాము దాదాపు ఏడాది పాటుగా కేవలం స్క్రిప్ట్ మీదే ఉన్నాం కాబట్టి కమల్ మేకింగ్, టేకింగ్ చాలా కొత్తగా అనిపించిందన్నారు. రాశీ సింగ్ విషయానికి వస్తే.. త్రిమూర్తులు భార్యగా ఆమె కనిపిస్తుందని.. ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.
నా మార్కెట్ తెలియాలనే..
గత పన్నెండేళ్లలో మన తెలుగు ఆడియెన్స్ తాను ఎక్కడ కనిపించినా కూడా ‘మళ్లీ సినిమాలు చేయండి సార్’ అని ప్రేమగా అడిగేవారని వడ్డే నవీన్ తెలిపారు. ఇప్పుడు తమ సినిమా మీద, తనపై కురిపిస్తున్న ప్రేమను చూస్తున్నానని.. వారి అభిమానానికి ఎప్పుడూ రుణపడే ఉంటానన్నారు. తనకు ప్రస్తుత సినిమాల్లో పాత్రల విషయానికి వస్తే ‘రంగస్థలం’ మూవీలో రామ్ చరణ్ వంటి పాత్ర చేయాలని ఉందన్నారు. అలాంటి ఛాలెంజింగ్ పాత్రలు ఏవైనా చేయాలని ఉంటుందన్నారు. నేరుగానే పెద్ద దర్శకుడితో సినిమా చేయొచ్చు. కానీ ముందు తన మార్కెట్ ఎంత ఉందో తెలియాలని కొత్త దర్శకుడితో చేసినట్టుగా తెలిపారు. పైగా అవతల ఉన్న పెద్ద దర్శకులకు సతైం తనతో చేయాలని కూడా ఉండాలన్నారు. ముందు తన సినిమా బయటకు వస్తే.. మార్కెట్ తెలుస్తుందన్నారు.
సోలోగానే కంటిన్యూ అవుతా..
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చూశాక మంచి సినిమా చేశాడనే ఫీడ్ బ్యాక్ ఆడియన్స్ ఇస్తారని నమ్ముతున్నానని వడ్డే నవీన్ అన్నారు. ఇప్పటి వరకు తన ఫ్యామిలీ మెంబర్లలో ఓ వంద మంది చూశారని.. అందరూ చిత్రాన్ని చూసి సర్ ప్రైజ్ అయ్యారన్నారు. నాని, శర్వానంద్ మంచి పాత్రలు, సినిమాలు చేస్తున్నారని.. ‘కోర్ట్’ బాగా నచ్చిందన్నారు. ప్రస్తుతం సోలో హీరోగా చేస్తున్నానని... అలానే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నానన్నారు. కథ నచ్చితే మల్టీస్టారర్ అయినా సరే చేస్తానన్నారు. టోటల్‌గా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం కథ నెమ్మదిగానే ప్రారంభం అవుతుందని.. కానీ సంఘర్షణ మొదలయ్యాక.. క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్‌గా వెళ్తుందన్నారు. క్లైమాక్స్‌ని మాత్రం ఎవ్వరూ ఊహించలేరని వడ్డే నవీన్ తెలిపారు.