Entertainment

సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మ్యూజిక్ సంచలనం అనిరుధ్

సంగీత సంచలనం.. రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌‌కు తోడుగా మరొకటి యాడ్ చేశారు.

సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మ్యూజిక్ సంచలనం అనిరుధ్

సంగీత సంచలనం.. రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌‌కు తోడుగా మరొకటి యాడ్ చేశారు. యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను ఆయన తాజాగా విడుదల చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా ఈ పాట రూపొందింది. ఈ ట్రాక్‌తో అనిరుధ్ త‌న సంగీత ప్ర‌పంచంలోని ప‌రిధిని దాటేశారు. తద్వారా సరికొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు.

వాస్తవానికి 2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనిరుధ్ దర్శకనిర్మాతలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారారు. 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జ‌వాన్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవడం విశేషం. అది ఓవర్‌నైట్‌లో వచ్చిన ఫేమ్ కాదు.. చాలా ఏళ్ల క‌ష్టంతో చిన్న స్థాయి నుంచి అసాధార‌ణ స్థాయికి అనిరుధ్ ఎదిగారు. అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ నుంచి కూడా రాక్‌స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్నారు.

ఇక తాజాగా అర‌వింద్ పాట విష‌యానికి వ‌స్తే.. వేగంగా మారుతోన్న డిజిట‌ల్ సంగీత ప్రపంచంలో త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌టానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ప‌డే క‌ష్టాల‌ను ప్ర‌ధానంగా అనిరుధ్ వివరించారు. ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే పాత్ర పేరు అరవింద్ అయినప్పటికీ అది అనిరుధ్‌కి ప్రతిబింబం లాంటి పాత్ర ఇది. ఈగో, ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, సంగీతంపై ఉన్న ప్యాషన్‌తో తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశాడు. ఇప్పటి డిజిటల్ యుగంలో పాటలను విడుదల చేయటం చాలా సుల‌భమే కానీ ద‌క్షిణ భార‌త సినీ రంగంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ప్ర‌తిభ‌ను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అంత సులువేం కాదు.

అయినప్పటికీ ఏదో ఒక రోజు తన సంగీతం ప్రేక్షకులను చేరుకుంటుందనే నమ్మకంతో పాటు కాన్ఫిడెన్స్‌తో అరవింద్ ముందుకు సాగుతూ సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా అనిరుద్ మాట్లాడుతూ ‘‘‘అరవింద్’ అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఓ త‌ర‌హా వ్యక్తిత్వమే. మన అందరి జీవితాల్లో ఓ అరవింద్ ఉంటాడు. అయితే తన ప్రతిభను చూపించడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోన్న‌ ఓ స్వతంత్ర కళాకారుడి కథను ఈ పాట చెబుతుంది. అలాగే నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఉన్న విప‌రీత‌మైన పోటీలో పెద్ద స్థాయికి చేరుకునే స‌మ‌యంలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఇది చూపిస్తుంది” అన్నారు.

ఈ పాటకు అనిరుధ్‌కు వ్య‌క్తిగ‌తంగా క‌నెక్టింగ్‌గా ఉంటుంది. దీనికి కారణం.. త‌ను కూడా జీవితంలో ఒకప్పుడు అరవింద్ ఇటువంటి ఫేజ్‌ను ఫేస్ చేసినవాడే కావడం. ఈ పాట ద్వారా ఇలాంటి ప్రయాణంలో ఉన్న ఇతర కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలని అనిరుద్ ఆశిస్తున్నారు. అలాగే తన ఎదుగుదల, ఎదురైన సవాళ్లు, అలాగే మొత్తం ఇండస్ట్రీపై ధైర్యంగా, ఆత్మపరిశీలనతో కూడిన వ్యాఖ్యల‌ను కూడా ఈ పాట ద్వారా తెలియ‌జేయడం విశేషం. అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా రాబోయే రోజుల్లో వివిధ రకాలైన ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్ , కాన్సెప్చువ‌ల్ ప్రాజెక్ట్స్‌ను డెవ‌ల‌ప్ చేసి రిలీజ్ చేయ‌టానికి అనిరుద్ సిద్ధ‌మ‌వుతున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 15, 2026 12:36 PM