Vijay-Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక.. ఆ రూమర్సేంటి? అవి నిజమేనా?
సోషల్ మీడియాలో మంచో.. చెడో ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మికల గురించి అవే వార్తలు వైరల్ అవుతున్నాయి. వారి గురించి ఏం రూమర్స్ అంటారా?
సోషల్ మీడియాలో మంచో.. చెడో ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మికల గురించి అవే వార్తలు వైరల్ అవుతున్నాయి. వారి గురించి ఏం రూమర్స్ అంటారా? వారి గురించి అంటే వారిద్దరూ జంటగా నటిస్తున్న ‘రణబాలి’ మూవీ గురించి. దీని చుట్టూ అనేకంటే ముఖ్యంగా విజయ్ దేవరకొండపై రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఏనాడు లేని విధంగా ఈ సినిమాకే పెద్ద ఎత్తున రూమర్స్ ఎందుకు వస్తున్నాయనేది అర్థం కావడం లేదు. కొందరు నిప్పు లేనిదే పొగ వస్తుందా? అంటుంటే మరికొందరు అందులో వాస్తవం లేదని అంటున్నారు.
షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ పెద్ద ఎత్తున కండీషన్స్ పెట్టేస్తున్నాడట. ఏకంగా ఏడు కారవాన్‌లు, 50 మంది అసిస్టెంట్స్ కావాలని డిమాండ్ చేశాడట. ఇలా పెద్ద ఎత్తున రూమర్స్ వినవస్తున్నాయి. విజయ్ దేవరకొండ కోరికల చిట్టాపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా రూమర్స్ వచ్చాయి. అంతేనా? ఈ వ్యవహారం నిర్మాతల మండలి వరకూ వెళ్లిందనే వార్తలు సైతం వైరల్ అయ్యాయి. వాస్తవానికి అసలిన్ని రూమర్స్ ఎందుకు? పోనీ విజయ్ దేవరకొండ ఏడు కారవాన్‌లు ఏం చేసుకుంటాడు. పైగా 50 మంది అసిస్టెంట్స్ ఎందుకు? అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? అనేది కూడా ఆసక్తికరమే. ఈ ప్రచారం అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది.
ఈ వార్తలపై ఇప్పుడు చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవిశంకర్ స్పందించారు. విజయ్ దేవరకొండపై వస్తున్న వార్తల్లో నిజమెంతనే విషయమై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఊహాగానాలేనని ఆయన తేల్చి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ చాలా ఒబీడియంట్‌గా ఉంటాడని.. ఆయన కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, బయట ప్రచారంలో ఉన్నవి కేవలం పుకార్లుగా కొట్టిపడేశారు. పని విషయంలో విజయ్ దేవరకొండ చాలా ప్రొఫెషనల్‌గానూ.. క్రమశిక్షణతోనూ పని చేసే వ్యక్తి అని రవిశంకర్ కొనియాడారు. దీంతో గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్టైంది.
విజయ్ దేవరకొండ, రష్మిక చాలా కాలం తర్వాత కలిసి పని చేస్తున్నారు. ‘రణబాలి’ అనే చిత్రంతో కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ‘రణబాలి’ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా రియల్ జంటను రీల్ జంటగా కూడా చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతుండటం కూడా దీనికి ఓ కారణం. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.