Victory Venkatesh: వెంకీ మామ హౌస్ నం:47 హోమ్ టూర్.. ఎప్పుడంటే..
విక్టరీ వెంకటేష్ ఇలా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? రీల్ ఇంటిని చాలా సార్లు చూపించారు కానీ రియల్ ఇంటిని ఇంతవరకూ చూపించలేదు కదా.
విక్టరీ వెంకటేష్ ఇలా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? రీల్ ఇంటిని చాలా సార్లు చూపించారు కానీ రియల్ ఇంటిని ఇంతవరకూ చూపించలేదు కదా. కానీ ఇప్పుడు కూడా రియల్ ఇంటిని కాదు.. రీల్ ఇంటిని.. కాదు కాదు ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపిస్తారట. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి’ చిత్రాలొచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. మరోసారి వీరిద్దరూ ‘ఆదర్శ కుటుంబం’ కోసం జత కట్టారు. దీని విడుదల తేదీని సైతం ప్రకటించారు.

తెలుగు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47” విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ చిత్రం అక్టోబర్ 2, 2026న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌తో సినిమాను విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్‌ను సడెన్‌గా చూస్తే వెంకీ మామ తన రియల్ ఫ్యామిలీ ఫోటోనా అనిపించడం ఖాయం. అంత నేచురల్‌గా ఉంది. ఈ చిత్రం భావోద్వేగాలు, వినోదం, హృదయాన్ని హత్తుకునే క్షణాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని పోస్టర్ స్పష్టం చేస్తోంది.
వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం దీనికి ఒక కారణమైతే.. వెంకి చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఒక కారణం. దీంతో ఈ సినిమా ప్రకటన పట్ల ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో అంచనాలు అమాంతం పెరిగాయి. విడుదలకు ముందు నుంచే ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.