others

Rain Alert: కూల్ ఖబర్.. వారం పాటు దంచికొట్టనున్న వర్షాలు.. అన్ని జిల్లాలకూ బిగ్ అలర్ట్

జూలై వస్తున్నా.. ఎండల వేడి మాత్రం తగ్గినట్టుగానే కనిపించడం లేదు. జూలై వస్తున్నా వాన జాడ అయితే కనిపించడం లేదు. వర్షాలు కురిసినా కూడా ఓ జల్లు పడి ఆగిపోతోంది. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ కూల్ ఖబర్ మోసుకొచ్చింది.

Rain Alert: కూల్ ఖబర్.. వారం పాటు దంచికొట్టనున్న వర్షాలు.. అన్ని జిల్లాలకూ బిగ్ అలర్ట్

జూలై వస్తున్నా.. ఎండల వేడి మాత్రం తగ్గినట్టుగానే కనిపించడం లేదు. జూలై వస్తున్నా వాన జాడ అయితే కనిపించడం లేదు. వర్షాలు కురిసినా కూడా ఓ జల్లు పడి ఆగిపోతోంది. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ కూల్ ఖబర్ మోసుకొచ్చింది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వారమంతా వర్షాలు కురవనున్నాయట. రాబోయే వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు బిగ్ అలర్ట్‌తో పాటు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

జూన్ ముగిసి జూలై ప్రారంభం కానున్నా రాష్ట్రంలో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గలేదు. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఓ జల్లు కురిసి ఆగిపోవడం మినహా విస్తృతంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అందించిన న్యూస్‌తో రైతుల్లో ఆనందం వెల్లివిరియనుంది. రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గుతున్నట్టుగా అనిపిస్తున్నా వేడి, ఉక్కపోత మాత్రం ఎక్కువగా ఉంటోంది. మరోవైపు శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా అయితే మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 28, 2026 2:24 AM