Entertainment

Mahesh Achanta: జనాలేమైనా గొర్రెలా?.. ప్రమోషన్ కోసం ఎంతకైనా దిగజారుతావా?

‘పాపం మహేష్ ఆచంట. ఎంత కష్టమొచ్చిందో.. ఉదయం నుంచి రాత్రి వరకూ కష్టపడి షూటింగ్‌లు చేసి డబ్బు సంపాదించి పెడుతుంటే తిని కూర్చోలేక అతని భార్య ఎవరినో తగులుకుందట’ అని జనాలు గొర్రెలు కాబట్టి పెద్ద ఎత్తున చర్చ పెడతారని ఓ ఆలోచన.

Mahesh Achanta: జనాలేమైనా గొర్రెలా?.. ప్రమోషన్ కోసం ఎంతకైనా దిగజారుతావా?

‘పాపం మహేష్ ఆచంట. ఎంత కష్టమొచ్చిందో.. ఉదయం నుంచి రాత్రి వరకూ కష్టపడి షూటింగ్‌లు చేసి డబ్బు సంపాదించి పెడుతుంటే తిని కూర్చోలేక అతని భార్య ఎవరినో తగులుకుందట’ అని జనాలు గొర్రెలు కాబట్టి పెద్ద ఎత్తున చర్చ పెడతారని ఓ ఆలోచన. దీనికోసం ఓ షోను ఎంచుకుని మరీ వెళ్లి ‘రంగస్థలం’ నటుడు మహేష్ ఆచంట భార్యతో కలిసి కూర్చొన్నాడు. భార్య ఫేస్ అయితే చూపించలేదు కానీ ఈయన మాత్రం ఆమెపై రెచ్చిపోతున్నాడు. పైగా ఎవరూ ఏమీ ఊహించుకుని రాయకండి.. అన్ని విషయాలు తీరిగ్గా చెబుతానంటున్నాడు.

అంతా ఓ పబ్లిసిటీ స్టంట్. ఈ పిచ్చిలో పడిపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. మహేష్ ఆచంట కూడా ప్రస్తుతం అదే చేస్తున్నాడు. అది చూసిన కొందరు.. ఆయన భార్య ఫోటో పెట్టి మరీ దానిని వైరల్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం భార్యతో గొడవపడుతున్నట్టుగా ఓ సీన్ క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఎంతకైనా దిగజారుతారా? భార్యతో పంచాయతీ కోసం ప్రముఖ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి లైవ్ లోనే తన భార్యను బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆమె ఎఫైర్స్ గురించి సైతం మహేష్ చర్చిస్తున్నాడు. తన భార్య స్థానంలో కూర్చొన్న ఆమె సైతం తనకు లగ్జరీ లైఫ్ ఇవ్వడం లేదనే ఉద్దేశంతోనే తన భర్తకి విడాకులు ఇవ్వబోతున్నానని తేల్చి చెబుతోంది.

ఇప్పుడిది చూసిన వారంతా ఏమనుకుంటున్నారు? మహేష్ భార్యనే కదా నేరుగా నిందిస్తారు. దిక్కుమాలిన ప్రమోషన్స్ కోసం ఎంతకైనా దిగజారుతారా? కేవలం ఇది షార్ట్ సిరీస్ కోసం చేసిన వీడియో అని బయట అయితే ప్రచారం జరుగుతోంది. గ్రామల్లోని వారికి ఇదంతా తెలియదు. మరి వారు నిందించేదెవరిని? డబ్బు కోసం వేరొకడితో వెళ్లిందంటూ నీచంగా మాట్లాడేది ఎవరి గురించి? ఆ మాత్రం స్పృహ ఉండదా? ఎవరో ఏదో చెప్పారని చేశారా? లేదంటే మహేష్ బుర్రకే ఈ పాడు ఆలోచన తట్టిందో.. అదీ కాదంటే అదొక సన్నివేశమో తెలియాలంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సిందే.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 27, 2026 3:38 PM