others

జిమ్‌కు వచ్చే మహిళలే అతడి టార్గెట్.. నైస్‌గా మాట్లాడి ఆపై..

జిమ్‌కు వచ్చే మహిళలను టార్గెట్‌గా చేసుకుని.. నైస్‌గా మాట్లాడి.. తానొక ఉత్తమోత్తముడినన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు

జిమ్‌కు వచ్చే మహిళలే అతడి టార్గెట్.. నైస్‌గా మాట్లాడి ఆపై..

అమ్మాయిలు వెధవలనే నమ్ముతారని ఇలాంటి ఘటనలను చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ నిత్య పెళ్లి కొడుకు యవ్వారం బయటకు వచ్చింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్లు చేస్తారేమో అసలు సిసలైన పెళ్లి. జిమ్‌కు వచ్చే మహిళలను టార్గెట్‌గా చేసుకుని.. నైస్‌గా మాట్లాడి.. తానొక ఉత్తమోత్తముడినన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు నిత్య పెళ్లికొడుకు అలియాస్ రవికుమార్ అలియాస్ రఫీ. మనిషి ఒక్కడే పేర్లే అనేకం. ఇక బిల్డప్ ఇవ్వడంతో ఆపడండోయ్ వారిని పెళ్లి వరకూ తీసుకెళ్లి పెళ్లి చేసుకుని మరీ వదిలేస్తాడు. ఇప్పటికి అలా ముగ్గురిని చేసుకున్నాడట.

ఇక ఈ నిత్య పెళ్లికొడుకు హైదరాబాద్‌లోని అల్వాల్‌లో మహిళతో పాటు ఆమె మైనర్ కూతురిపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడట. వారు పోలీసులను ఆశ్రయించడంతో నిత్య పెళ్లికొడుకుపై పోక్సో కేసు నమోదైంది. 2025 ఆగస్టు 28 లోనే కేసు నమోదైంది. నిందితునితో పాటు కొంత మంది ముఠా కలిసి జిమ్‌లో పరిచేయమైన మహిళను వేధిస్తున్నారు. మహిళ కారులో లైవ్ ట్రాకింగ్ డివైస్‌లు, సీక్రెట్ కెమెరాలు పెట్టి మరీ ఆమెను హింసిస్తున్నారు. ఈ క్రమంలోనే రవి అలియాస్ రఫీ.. రూపేష్ రాజ్ అనే మరో వ్యక్తి కలిసి మహిళతో పాటు ఆమె మైనర్ కూతురును వేధింపులకు గురిచేసినట్లు మహిళ అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

అయితే మల్కాజ్‌గిరి కమిషనర్‌గా సుమతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసును రీ ఓపెన్ చేశారు. సుమతి ఆదేశాల మేకు విచారణ నిర్వహించిన పోలీసులు.. బాధితురాలి కూతురును వేధింపులకు గురి చేయడం, అసభ్యంగా ప్రవర్తించారని తేల్చారు. ఈ క్రమంలోనే నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. A1 రూపేష్ రాజ్, A2 రవి కుమార్ అలియాస్ రఫీ లను ఈ కేసులో చేర్చారు. రవికుమార్ అలియాస్ రఫీ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడట. గతంలో కూడా ఇదే విధంగా జిమ్‌కు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 29, 2026 3:50 PM