Entertainment

ఫుడ్ డెలివరీ బాయ్‌పై అఖిల్ రాజ్ హీరోయిజం.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్

ఫుడ్ డెలివరీ బాయ్.. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక బైక్ వేసుకుని ఎక్కడంటే అక్కడికి ఆర్డర్ తీసుకుని వెళుతుంటారు. పొరపాట్లు సర్వసాధారణం. అలాగని ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌పై చేయి చేసుకోవడం కరెక్టేనా?

ఫుడ్ డెలివరీ బాయ్‌పై అఖిల్ రాజ్ హీరోయిజం.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్

ఫుడ్ డెలివరీ బాయ్.. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక బైక్ వేసుకుని ఎక్కడంటే అక్కడికి ఆర్డర్ తీసుకుని వెళుతుంటారు. పొరపాట్లు సర్వసాధారణం. అలాగని ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌పై చేయి చేసుకోవడం కరెక్టేనా? ఒక సినిమాలో హీరోగా చేస్తే కొమ్ములొచ్చేస్తాయా? ఒక్క ఇన్సిడెంట్ చాలుగా జీరో అయిపోవడానికి? అదెందుకు ఆలోచించరు? తాజాగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవపడ్డాడు. పట్టుకున్నా ఆగకుండా అతనికి కొట్టేందుకు మీద మీదకు ఉరికాడు. తాను రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు క్షమాపణలు చెప్పానని సదరు ఫుడ్ డెలివరీ బాయ్ చెబుతున్నాడు.

ఇక హీరో తల్లి.. పెద్దావిడ కనీసం ఇంగితం లేకుండా ఫుడ్ డెలివరీ బాయ్‌పై ఉమ్మేసిందట. సదరు ఫుడ్ డెలివరీ బాయ్ మాట్లాడుతున్న మాటలు.. అతడిని కొట్టేందుకు తండ్రిని నెట్టుకుని మరీ అఖిల్ వెళుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో చివరిలో రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలని అఖిల్ బెదిరింపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. వీడియో చూస్తే.. అఖిల్ రాజ్ తన కుటుంబంతో కలిసి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్నాడని తెలుస్తోంది. కానీ ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌పై వీరంగం వేయడమనేది ఎంతవరకూ సమంజసం? చిన్న బతుకులపైనా అఖిల్ హీరోయిజం. ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా?

అఖిల్ రాజ్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్‌కు మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చిన్న విషయానికి అంతటి రాద్దాంతం చేస్తూ హీరోయిజం చూపించడమేంటని మండిపడుతున్నారు. అఖిల్ రాజ్'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రంలో చేస్తున్నాడు. 'అర్జునుడి గీతోపదేశం' టైటిల్‌తో సతీష్ గోగాడ రూపొందిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, రాజీవ్ సాలూర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 29, 2026 2:17 PM