Anirudh: రాక్‌స్టార్ పెళ్లి ఫిక్స్.. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ వెడ్డింగ్.. అమ్మాయి ఎవరంటే..
దక్షిణాదిలో రాక్‌స్టార్‌గా వెలుగొదుతున్న అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆయన మేనమామ వైజీ మహేంద్రన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇంతకీ ఆయనకు కాబోయే వధువు ఎవరంటారా?
దక్షిణాదిలో రాక్‌స్టార్‌గా వెలుగొదుతున్న అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆయన మేనమామ వైజీ మహేంద్రన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇంతకీ ఆయనకు కాబోయే వధువు ఎవరంటారా? వాస్తవానికి ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తన హావభావాలతో సోషల్ మీడియాను షేక్ చేసిన 'సన్ రైజర్స్ హైదరాబాద్' బాస్ కావ్యమారన్ లవ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి కావ్యనే అనిరుధ్ వివాహం చేసుకోబోతున్నాడా? మరెవరినైనా చేసుకోబోతున్నాడా? అంటే ఆయన మేనమామ అనిరుధ్‌కు కాబోయే వధువు పేరుతో సహా రివీల్ చేశారు. దీంతో ఇప్పడు అనిరుధ్ పెళ్లి వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ సీనియర్ నటుడు, అనిరుధ్ మేనమామ వైజీ మహేంద్రన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ మెగా వెడ్డింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్ చాలా సాఫ్ట్ బాయ్ అని.. తను ఒక పెద్ద ఇంటికి అల్లుడు కాబోతున్నాడని తెలిపారు. తనకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి పెళ్లి దాదాపు ఖాయమైంది అంటూ మహేంద్రన్ బాంబ్ పేల్చారు. అంటే ఇన్‌డైరెక్ట్‌గా.. ఇన్నాళ్లూ కేవలం రూమర్స్‌కే పరిమితిమైన అనిరుధ్ క్రేజీ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటల వరకు చేరినట్లు తెలుస్తోంది. అంటే అనిరుధ్ తను ప్రేమించిన కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్నారన్న మాట. అంతేకాదు.. ఇంకా వైజీ మహేంద్రన్ మాట్లాడుతూ.. కావ్య సాదాసీదా అమ్మాయి కాదని.. సన్‌రైజర్స్ లాంటి పెద్ద టీమ్‌ను సమర్థవంతంగా నడిపిస్తోందన్నారు.
ఆమెకు తన తండ్రి కళానిధి మారన్ వ్యాపార లక్షణాలు వచ్చాయన్నారు. అనిరుధ్, కావ్య ఇద్దరూ బెస్ట్ పెయిర్ అని... పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి మ్యూజికల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాలంటూ వైజీ మహేంద్రన్ ఆకాంక్షించారు. వాస్తవానికి అనిరుధ్, కావ్య ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ 2005లోనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ రజినీకాంత్ స్వయంగా కళానిధి మారన్ ఇంటికి వెళ్లి మరీ పెళ్లి ప్రతిపాదన తెచ్చారంటూ కూడా ప్రచారం జరిగింది. అప్పట్లో అనిరుధ్ మాత్రం పెళ్లి వార్తలను కేవలం రూమర్స్ అని నమ్మవద్దంటూ కొట్టిపడేశాడు. అయితే అప్పుడు కూడా డేటింగ్ వార్తలను మాత్రం ఆయన ఖండించలేదు. ప్రస్తుతం అనిరుధ్, ‘జైలర్ 2, జన నాయగన్, షారుఖ్‌ఖాన్ కింగ్, అల్లు అర్జున్ రాకా వంటి చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం కావ్య మారన్ ఐపీఎల్ కారణంగా బిజీగా ఉన్నారు. ఆమె ఫ్రీ అవగానే వీరి పెళ్లి తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి వీరి పెళ్లి జరిగితే మాత్రం సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ వెడ్డింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.