Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త.. ‘ఫౌజి’కి ముహూర్తం ఫిక్స్!
హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ రూపొందుతోంది. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవలేదు కానీ మూవీ టీమ్ మాత్రం రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుని దానికి అనుగుణంగా సినిమాను రూపొందిస్తున్నారని టాక్.
ప్రభాస్ ఫ్యాన్స్‌కి నిజంగానే ఇదొక పండుగ లాంటి వార్త. ఈ ఏడాది సంక్రాంతికి ‘రాజాసాబ్’గా ప్రభాస్ వచ్చి ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ లైన్‌లో ఫౌజి, స్పిరిట్, సలార్2, కల్కి2 వంటి చిత్రాలుండటంతో పోనీలే అనుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాల్లో నుంచి ఒక చిత్రం రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా వార్తలు వినవస్తున్నాయి. హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ రూపొందుతోంది. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవలేదు కానీ మూవీ టీమ్ మాత్రం రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుని దానికి అనుగుణంగా సినిమాను రూపొందిస్తున్నారని టాక్.
ముందుగా ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రానున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ ఫ్యాన్స్ చూడని గెటప్‌లో ప్రభాస్ కనిపిస్తున్నారు కాబట్టి ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. వాస్తవానికి ఒక విజువల్ వండర్‌గా కట్ చేసి మేకర్స్ గ్లింప్స్‌ను వదలనున్నారట. ప్రభాస్ రోల్‌ను చాలా పవర్‌ఫుల్‌గా హను రాఘవపూడి తీర్చిదిద్దుతున్నారట. ఇక ఈ ఏడాది ఎండింగ్‌లోనే ప్రభాస్ ‘ఫౌజి’తో ఆడియన్స్‌ను పలకరించనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటుస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.