NTR: ఉత్తరంలో పుట్టాడు.. మధ్య భారతంలో పెరిగాడు.. బిగ్ అప్‌డేట్ వచ్చేసింది..
మీడియాకు కొన్ని కొన్ని అలా తెలిసిపోతుంటాయంతే.. మేకర్స్ ఇచ్చిన లింకులు సెట్ చేస్తే సినిమా కొంతవరకూ అర్థమైపోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చేస్తున్నాడు.
మీడియాకు కొన్ని కొన్ని అలా తెలిసిపోతుంటాయంతే.. మేకర్స్ ఇచ్చిన లింకులు సెట్ చేస్తే సినిమా కొంతవరకూ అర్థమైపోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చేస్తున్నాడు. తన నెక్ట్స్ సినిమాను సైతం లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఎప్పటి నుంచో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో గురించి టాక్ నడుస్తూనే ఉంది. తాజాగా బిగ్ అప్‌డేట్ రానే వచ్చింది. ‘అరవింద సమేత’ తర్వాత వీళ్లిద్దరి కాంబో అయితే రిపీట్ అవలేదు. త్వరలోనే అది జరుగనుంది. ఆ చిత్రాన్ని నాగవంశీ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్ (God of War)’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. తాజాగా ఈ మూవీపై అధికారిక ప్రకటన వెలువడింది.
జనాలు చాలా కాలంగా వీరిద్దరి కాంబోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానమేల.. పక్కా ఉంటుందని నాగవంశీ హింట్స్ తరచూ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఆయన నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఫైనల్లీ వచ్చేస్తోందని నాగవంశీ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక సాయంత్రం 5:04 నిమిషాలకు ఆ బిగ్ అప్‌డేట్ రానే వచ్చింది. ఈ అప్‌డేట్ ఏం ఇచ్చారో తెలుసుకుందాం. అసలు దానికి ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. నాగవంశీ ముందుగా పెట్టిన పోస్ట్‌లో నెమలి ఎమోజీ ఉపయోగించడం ఆసక్తిని పెంచింది. అంటే ఇదొక మైథలాజికల్ ప్రాజెక్ట్ అని చెప్పకనే చెప్పారంటూ టాక్ నడిచింది. అంతేకాదు ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తోడై న్యూ జర్నీ స్టార్ట్ అన్నట్టుగా సంకేతాలిచ్చేశారు. గతేడాది కూడా ‘అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకడిగా నా ఫేవరెట్ బ్రదర్’ అంటూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓ శ్లోకాన్ని షేర్ చేశారు. అప్పటి నుంచి జనాలంతా ఎక్కడో కొడుతోంది వంశీ అనుకుంటున్నారు.
పురాణాల్లో హిందూ యుద్ధ దేవుడుగా కీర్తించే సుబ్రహ్మణ్యస్వామి ఇతివృత్తంతో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోందని ఇన్ డైరెక్ట్‌గా చెబుతున్నారని జనాలు గెస్ కొట్టారు. దీనికి తోడు తాజాగా నెమలి వాహనంస్వామి కుమారస్వామికు ప్రతీకగా భావించే నెమలి ఎమోజీని పెట్టడం జనాల గెస్‌కు మరింత బలంగా మారింది. దీంతో ఈ చిత్రం స్వామి కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి ఆధారంగా రూపొందుతున్న మైథలాజికల్ డ్రామానేనని ఫిక్స్ అయిపోయారు. ఇక ఎన్టీఆర్ ఏమైనా తక్కువ తిన్నారా? ముంబై విమానాశ్రయంలో Muruga - The Lord of War, The God of Wisdom పుస్తకంతో కనిపించి సినిమాపై మరిన్ని ఊహాగానాలకు తావిచ్చారు. ఇక తాజాగా వచ్చిన అప్‌డేట్‌లో ఏముందంటే..
టైటిల్ అయితే ప్రకటించలేదు కానీ ఒక త్రిశూలం.. దాని నుంచి కైలాసానికి ఒక తాడుతో నిచ్చెన వేస్తున్నట్టుగా ఉందా పోస్టర్. దీనికి
‘నార్త్‌లో జన్మించాడు
మధ్య భారతంలో పెరిగాడు.
దక్షిణాదిలో దైవంగా ఆరాధించబడ్డాడు
ఇప్పుడు... ప్రపంచమంతా సొంతం చేసుకునే ఓ విశ్వగాథగా రాబోతున్నాడు. అని పోస్ట్ పెట్టారు. మొత్తానికి మైథలాజికల్ మూవీతో అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ రాబోతున్నారు ఇది ఫిక్స్.