వాట్సాప్ నయా ఫీచర్.. యూజర్‌నేమ్‌తో చాట్.. స్పామ్‌కు ఫుల్ స్టాప్!
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఎన్ని యాప్‌లు వచ్చినా కూడా వాట్సాప్‌కు ఉండే ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదు. తాజాగా వాట్సాప్ తన యూజర్ల కోసం భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఎన్ని యాప్‌లు వచ్చినా కూడా వాట్సాప్‌కు ఉండే ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదు. తాజాగా వాట్సాప్ తన యూజర్ల కోసం భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకూ వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేస్తే మన పర్సనల్ ఫోన్ నంబర్ వారికి తెలిసిపోయేది. ఇక మీదట ఇన్‌స్టాగ్రామ్ మాదరికిగా వాట్సాప్‌లో కూడా నంబర్ కనిపించకుండా ప్రత్యేకంగా యూజర్ నేమ్‌తో ఎవరితోనైనా చాట్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వారి భద్రతే లక్ష్యంగా మెటా యాజమాన్యం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇటీవల ఇండియన్ ఫిన్‌టెక్ దిగ్గజం 'క్రెడ్') వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత వాట్సాప్ నుంచి వస్తున్న మొదటి మేజర్ అప్‌డేట్ ఇదే కావడం విశేషం. ఇది ఎలా పని చేస్తుందంటే.. ప్రతి యూజర్ 3 నుండి 35 అక్షరాల మధ్య ఉండే ఒక యూనిక్ యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సోషల్ మీడియా ఐడెంటిటీ మాత్రమే కాకుండా పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్‌గానూ యూజర్స్‌కి ఉపయోగపడనుంది. మార్కెట్లో ఇతర యాప్స్ లాగా ఇందులో అందరి యూజర్‌నేమ్స్ వెతికేలా ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ ఉండదు కాబట్టి అవతలి వ్యక్తికి మీ కచ్చితమైన యూజర్‌నేమ్ తెలిస్తేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు.
అంతేకాకుండా 'యూజర్‌నేమ్ కీ' అనే మరో అడిషనల్ ప్రొటెక్షన్‌ను కూడా వాట్సాప్ యాడ్ చేసింది. ఎవరైనా కొత్తవాళ్లు మీ యూజర్‌నేమ్ తెలిసినా కూడా మెసేజ్ చేయాలంటే ఈ కీ తప్పనిసరి అవుతుంది. కాబట్టి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లను ఈజీగా అడ్డుకోవచ్చు. వాట్సాప్ అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. అలాంటి తరుణంలో అపరిచిత వ్యక్తులకు, వ్యాపారులకు ఫోన్ నంబర్ ఇవ్వడమనేది చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఈ యూజర్‌నేమ్ వారికి ఓ వరంలా పని చేస్తుంది. ఇక్కడ ఓ చిక్కు ఉంది. అదేంటంటే.. లక్షలాది మంది ఒకే రకమైన పేర్ల కోసం పోటీ పడే అవకాశం ఉంది. దీంతో వాట్సాప్ యూజర్‌నేమ్ రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీనివల్ల యూజ్ ఏంటంటే.. ఒకరి పేరుతో మరొకరు ఫేక్ ప్రొఫైళ్లు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉండదు.